EPFO: ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా?.. అయితే ఈ లిస్ట్ చెక్ చేయండి
ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సభ్యులు తమ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించుకుంటున్నారు.కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది తమ క్లెయిమ్‌లు రిజెక్ట్ అవుతున్నాయని, లేదా క్లెయిమ్ చేసిన దానికంటే తక్కువ మొత్తాన్ని మాత్రమే అప్రూవ్ చేశారని సోషల్ మీడియా వేదికలపై ఫిర్యాదులు చేస్తున్నారు. కరోనా కాలంలో కేంద్రం కొంత వెసులుబాటు కల్పించడంతో ఈపీఎఫ్ఓ అన్ని క్లెయిమర్లకు డబ్బులు జమ చేసింది. అయితే ప్రస్తుతం చాలా మంది క్లెయిమ్‌లు రిజెక్ట్ అవుతున్నాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? కారణాలను తెలుసుకోవడం మంచిది.
ఈపీఎఫ్ఓ తన అధికారిక పోర్టల్‌లో జనరల్ వివరణ
మీ ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు అది ఊహించని కారణంగా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఎలాంటి స్పష్టత లేకుండా క్లెయిమ్‌లు రిజెక్ట్ చేయబడతాయి. అయితే, ఈ విషయంపై ఈపీఎఫ్ఓ తన అధికారిక పోర్టల్‌లో జనరల్ వివరణ అందించింది. అందులో ముఖ్య కారణాలు సరైన పత్రాల లేకపోవడం, వివరాల్లో తేడాలు ఉండడం. ఈ అంశాలను సాధారణంగా ఉద్యోగులు పట్టించుకోరు, ఎందుకంటే వారు తమ వివరాలు సక్రమంగా ఉన్నాయని భావిస్తారు. కానీ, విత్‌డ్రా చేయాలని ప్రయత్నించినప్పుడు అసలు సమస్యలపై వెలుగుపడుతుంది. క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు కారణాలను తెలుసుకోవాలంటే, పీఎఫ్ క్లెయిమ్‌లు రిజెక్ట్ అయ్యేందుకు 11 కారణాలు ఉన్నాయి. ఆ లిస్ట్‌ని ఓసారి పరిశీలిద్దాం.
11 కారణాలు
ఇన్‌కంప్లీట్ కేవైసీ యూఏఎన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోవడం పేరు, పుట్టిన తేదీ వివరాలు సరిపోలకపోవడం ఈపీఎఫ్ఓ రికార్డులు, మీ దరఖాస్తు ఫారంలోని యూఏఎన్ నంబర్ వేరువేరుగా ఉండడం డేట్ ఆఫ్ జాయినింగ్, రాజీనామా వంటి వివరాల్లో తేడా ఉండడం పని చేసిన కంపెనీ పేరు, కోడ్ వంటి వివరాలు తప్పుగా ఉండడం బ్యాంక్ ఖాతా వివరాలైన అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్రాంచ్ పేరు వంటివి సరిగా లేకపోవడం క్లెయిమ్ సబ్మిషన్ ఫారంలో తప్పులు ఉండడం ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ విఫలమవడం అర్హత లేని ఈపీఎస్ అకౌంట్ (బేసిక్ శాలరీ రూ.15 వేలు దాటిన ఖాతాలు) అనగ్జరీ కే తీసుకోవడంలో విఫలమవడం
పీఎఫ్ నామినేషన్స్‌ను అప్డేట్ చేయడం ముఖ్యం
క్లెయిమ్‌ని రిజెక్ట్ కాకుండా చేసుకోవాలంటే, దరఖాస్తు చేసేముందు వివరణలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీ ఆధార్ డేటా, ఈపీఎఫ్‌ఆర్ రికార్డుల్లో ఏవైనా తేడాలు ఉన్నాయో చూసుకోవాలి. యూఏఎన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలి. పీఎఫ్ నామినేషన్స్‌ను అప్డేట్ చేయడం కూడా ముఖ్యం. ఏమైనా తప్పులు ఉంటే, పాత కంపెనీ వివరాలను ధృవీకరించాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలను కనీసం ఒకటి లేదా రెండు సార్లు సమీక్షించాలి. అన్ని వివరాలను సరిచూసుకున్న తర్వాతే దరఖాస్తు చేయడం ద్వారా మీ ఖాతాలో డబ్బులు సునాయాసంగా వస్తాయి.