Bank Holidays: ఈనెలలో బ్యాంకులకు 17 సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?
డిసెంబర్ నెలలో బ్యాంక్ లు 17 రోజుల పాటు మూతపడనున్నాయి. జాతీయ, స్థానిక పండుగలు, సెలవులు, ఇతర కారణాల వల్ల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన క్యాలెండర్ ప్రకారం, డిసెంబర్ నెలలో ప్రతి ఆదివారం, రెండో, నాల్గో శనివారం బ్యాంకులు మూసివేస్తారు. ఈ సెలవులతో కలిపి, ఈ నెలలో మొత్తం 17 రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయని తెలిపింది.
డిసెంబర్ 2024లో బ్యాంకులు మూసివేసే తేదీలు
డిసెంబర్ 1: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు డిసెంబర్ 3: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ (గోవా) డిసెంబర్ 10: మానవ హక్కుల దినోత్సవం (దేశవ్యాప్తంగా) డిసెంబర్ 11: UNICEF పుట్టినరోజు (ఆగ్నేయ భారతదేశంలో) డిసెంబర్ 12: మేఘాలయ - పటోగన్ నెంగ్మింజా సంగ్మా పండుగ డిసెంబర్ 18: యు సోసో థామ్ వర్ధంతి (మేఘాలయ, చండీగఢ్) డిసెంబర్ 19: గోవా విమోచన దినోత్సవం డిసెంబర్ 24: గురు తేగ్ బహదూర్ బలిదానం, క్రిస్మస్ ఈవ్ (మిజోరం, మేఘాలయ, పంజాబ్, చండీగఢ్) డిసెంబర్ 25: క్రిస్మస్ (దేశవ్యాప్తంగా) డిసెంబర్ 26: బాక్సింగ్ డే, క్వాంజా(దేశవ్యాప్తంగా) డిసెంబర్ 30: తము లోసార్ (సిక్కిం,మేఘాలయ) డిసెంబర్ 31: నూతన సంవత్సరం వేడుకలు (మిజోరం)
సెలవుల రోజుల్లో అందుబాటులో ఉన్న సేవలు
సెలవు రోజుల్లో కూడా బ్యాంకింగ్ సేవలను డిజిటల్ మాధ్యమాల ద్వారా కొనసాగించవచ్చు. డిజిటల్ బ్యాంకింగ్, UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు. చెక్కుల ఆర్డర్ బిల్లులు చెల్లించడం ప్రీపెయిడ్ ఫోన్ రీఛార్జ్ డబ్బు బదిలీ హోటల్ బుకింగ్ టిక్కెట్ బుకింగ్ ఖర్చుల వివరణ డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ ప్రక్రియ మరింత సులభంగా మారింది, కనుక సెలవు రోజుల్లో కూడా ఆర్థిక కార్యకలాపాలు చేసుకోవచ్చు.