India inequality: భారత్ లో 40శాతం సంపద మొత్తం ఒక్క శాతం సంపన్నుల వద్దే ఉంది : రిపోర్టులో కీలక విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారనే వాదన ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తోంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది, జపాన్‌ను కూడా అధిగమించింది. అయితే దేశంలో ఆర్థిక అసమానతలు ఏ మాత్రం తగ్గడం లేదు. వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం, భారత్‌లో ఆర్థిక అసమానతలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా ఉన్నాయి. దేశంలోని 40 శాతం సంపద కేవలం ఒకే శాతం అత్యంత సంపన్న వ్యక్తుల వద్దే కేంద్రీకృతమైంది. ఈ రిపోర్ట్‌ను విశ్లేషకులు లుకాస్ చాన్సెల్, రికార్డో గోమెస్ కరెరా, రోవైదా మోష్రిఫ్, థామస్ పికెట్టి ఎడిట్ చేసి ప్రచురించారు. నివేదిక ప్రకారం, ఇటీవలి కాలంలో అసమానతలు తగ్గే సూచనలు కనిపించలేదు.
Details
కింది స్థాయిలో ఉన్న 50శాతం వర్గానికే 15శాతం ఆదాయం
భారత్‌లో అత్యంత సంపన్న టాప్ 10% వర్గం సుమారు 65% సంపదను పొందుతోంది. ఆదాయ అసమానతలు కూడా గణనీయంగా ఉన్నవి. దేశ ఆదాయంలో 58% అత్యంత ఉన్నత వర్గంలో ఉన్న టాప్ 10% వారికే దక్కుతోంది. కింద స్థాయిలో ఉన్న 50% వర్గానికి కేవలం 15% ఆదాయం దక్కుతోంది. 2014 నుంచి 2024 వరకు టాప్ 10% మరియు బాటమ్ 50% మధ్య ఆదాయం వ్యత్యాసం స్థిరంగా ఉన్నది. అంటే, పదేళ్ల క్రితం ఉన్న అసమానతలు ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతున్నాయి.
Details
అసమానతలు అధికంగా కొనసాగుతున్నాయి
భారతదేశంలో సగటు వార్షిక ఆదాయం (Purchasing Power Parity ఆధారంగా) సుమారు 6,200 యూరోస్, అంటే దాదాపు రూ.6.49 లక్షలు. సగటు సంపద 28,000 యూరోస్. మహిళల శ్రమ భాగస్వామ్యం కేవలం 15.7%, గత దశాబ్దంలో పెరుగుదల లేదు. మొత్తానికి, భారత్‌లో ఆదాయం, సంపద, లింగ పరమైన అసమానతలు అధికంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక విభేదాలు స్పష్టంగా ఉన్నాయని రిపోర్ట్ సూచించింది.