Medicines Fail: దేశంలో 49 రకాల మందులు నాణ్యతలో ఫెయిల్.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
దేశంలో సెప్టెంబర్ నెలలో జరిపిన ఔషధాల నాణ్యత పరీక్షల్లో 49% మందులు ఫెయిల్ అయినట్లు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నారు. ముఖ్యంగా, మధుమేహం, కడుపు నొప్పి వంటి వాటికి సంబంధించిన మందులు, అలాగే మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, పెయిన్‌కిల్లర్‌లు ఎక్కువగా గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (NSQ) ఔషధాల రేటు గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది అనూహ్యంగా తగ్గింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆధ్వర్యంలో తీసుకున్న కఠిన చర్యలు, ఔషధాల పర్యవేక్షణ తక్కువ ప్రభావవంతమైన మందుల శాతాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయని డిసీజీఐ డాక్టర్ రాజీవ్ సింగ్ రాఘువంశీ తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
సెప్టెంబర్ జాబితాలో భాగంగా 49 మందులలో మధుమేహ వ్యతిరేక మందు మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, కడుపు ఇన్ఫెక్షన్‌కు సంబంధించి మెట్రోనిడాజోల్ మాత్రలు, పెయిన్‌కిల్లర్ డైక్లోఫెనాక్ సోడియం, యాంటీబయాటిక్ జెంటామిసిన్ ఇంజెక్షన్, యాంటీ-అలెర్జీ ఫెక్సోఫెనాడిన్ హైడ్రోక్లోరైడ్ వంటి మందులు ఉన్నాయని గుర్తించారు. ఈ విషయంపై ప్రజలు, వైద్యులు, సంబంధిత రంగంలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని CDSCO సూచిస్తోంది.