Apple Iphone: 2023లో 8-9 మిలియన్ ఐఫోన్‌లను అమ్మడమే యాపిల్ టార్గెట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ 2023లో రికార్డు స్థాయిలో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2022లో 6.7 మిలియన్ ఐఫోన్లను విక్రయించినట్లు యాపిల్ సంస్థ ఈ ఏడాది 8-9 మిలియన్ ఐఫోన్ షిప్‌మెంట్‌ల లక్ష్యాన్నిపెట్టుకుంది.
2023 క్యాలెండర్ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, గతేడాదితో పోలిస్తే దాదాపు 4 మిలియన్ అమ్మకాలు రెట్టింపు అయినట్లు 'ది ఎకనామిక్ టైమ్స్' నివేదిక చెబుతోంది.
ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ సంస్థ తన తన అత్యుత్తమ మార్కెట్ వాటాను 6-7 శాతానికి చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐఫోన్
ఈ ఏడాది ద్వితీయార్థంలో అమ్మకాలు పెరిగే అవకాశం
ఐఫోన్ 15 లాంచ్‌తో పాటు ఈ ఏడాది ద్వితీయార్థంలో పండగలు ఉండటంతో ఆఫర్లు లభించే అవకాశం ఉంది. దీంతో అమ్మకాల్లో మరింత దూకుడు పెరుగుతాయని సంస్థ భావిస్తోంది.
గత సంవత్సరం మూడో, నాలుగో త్రైమాసికాల్లో ఐఫోన్ అమ్మకాలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉండదని, అమ్మకాలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
జూన్ 30న Apple Inc మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా 3 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది.
ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో యూపిల్ ఇటీవలి త్రైమాసిక నివేదికలో అమ్మకాలు ఊహించిన దానికంటే తక్కువ పతనాన్ని నమోదు చేశాయి.
ఆ కంపెనీకి ఉన్న హై ప్రొఫైల్ వల్లే పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని సంస్థ కోల్పోలేదని తెలుస్తోంది.