Loading...
Sudden Layoffs: 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఔట్‌.. ఐదు నిమిషాల కాల్‌తో అమెరికా సంస్థ నిర్ణయం
80 మంది భారతీయుల ఉద్యోగాలు ఔట్‌.. ఐదు నిమిషాల కాల్‌తో అమెరికా సంస్థ నిర్ణయం

Sudden Layoffs: 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఔట్‌.. ఐదు నిమిషాల కాల్‌తో అమెరికా సంస్థ నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ఓ ఆర్థిక సేవల సంస్థలో పనిచేస్తున్న 80 మంది భారతీయ ఉద్యోగులకు ఊహించని పరిణామం ఎదురైనట్లు తెలుస్తోంది. కేవలం ఐదు నిమిషాలపాటు జరిగిన గూగుల్‌ మీట్‌ కాల్‌లో మొత్తం కస్టమర్‌ సపోర్ట్‌ టీమ్‌ను తొలగించినట్లు ఓ ఉద్యోగి సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

వివరాలు 

'ఆపరేషనల్‌ కారణాలు' అంటూ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశం

ఆ రోజు తమ టీమ్‌ 'ఆపరేషనల్‌ కారణాల'తో ఇంటి నుంచే పనిచేయాలని సంస్థ ఆదేశించినట్లు ఉద్యోగి తెలిపారు.

సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన షిఫ్ట్‌లో రాత్రి 9.30 గంటల వరకు విధులు నిర్వహించిన అనంతరం ఉన్నతాధికారులు అకస్మాత్తుగా గూగుల్‌ మీట్‌ ఏర్పాటు చేశారని చెప్పారు.

ఆ సమావేశంలో భారత కస్టమర్‌ సర్వీస్‌ టీమ్‌ మొత్తాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారని ఆయన వెల్లడించారు.

దీంతో దాదాపు 80 మంది ఉద్యోగులు ఒకేసారి ఉపాధి కోల్పోయారని తెలిపారు. కేవలం ఐదు నిమిషాల కాల్‌ నిర్ణయం 80 కుటుంబాలపై ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాలు 

ఉద్యోగ భద్రత కోసం అదనపు సమయం పనిచేశామని వెల్లడి

ఉద్యోగ భద్రతపై ఆందోళన ఉన్నప్పటికీ, అదనపు సమయం పనిచేస్తూ తమ పనితీరును మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించామని ఉద్యోగి పేర్కొన్నారు.

అయినా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం తీవ్రంగా బాధించిందని అన్నారు.

బ్లూవైన్‌ సంస్థపైనే ఆరోపణలు

ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో పలువురు స్పందించారు. ఉద్యోగి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ తొలగింపుల వెనుక అమెరికాకు చెందిన డిజిటల్‌ బ్యాంకింగ్‌ సంస్థ బ్లూవైన్‌ (Bluevine) ఉన్నట్లు తెలుస్తోంది.

చిన్న వ్యాపారాలకు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, చెల్లింపు సేవలు, క్రెడిట్‌ సదుపాయాలను ఈ సంస్థ అందిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

పనితీరు విషయంలో భిన్న వాదనలు

భారత టీమ్‌ నుంచి ఆశించిన స్థాయిలో పనితీరు కనిపించడం లేదని తమకు చెప్పినట్లు ఉద్యోగి తెలిపారు.

అయితే అమెరికా టీమ్‌లోనే ఉద్యోగుల మార్పులు, సెలవులు, పనిలో లోపాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. భారత ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోసం మరింత శ్రమించి పనిచేశారని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT