LOADING...
8th Pay Commission:  జనవరి 1 2026 నుంచి అమల్లోకి రానున్న 8వ పే కమిషన్ 
జనవరి 1 2026 నుంచి అమల్లోకి రానున్న 8వ పే కమిషన్

8th Pay Commission:  జనవరి 1 2026 నుంచి అమల్లోకి రానున్న 8వ పే కమిషన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్లకు త్వరలో శుభవార్త అందనుంది. 8వ వేతన సంఘం అమలులోకి రాబోతోంది. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు,ఇతర అలవెన్సులు, అలాగే పెన్షనర్ల పెన్షన్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చర్యతో కోటికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. కేంద్ర ఉద్యోగుల జీతాలు ఉద్యోగి స్థాయి, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా నిర్ణయించబడతాయి. 7వ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను 18 స్థాయిలుగా వర్గీకరించారు. ఇందులో: *లెవెల్ 1 = గ్రూప్ డి ఉద్యోగులు లెవెల్ 18 = కేబినెట్ సెక్రటరీ, అత్యున్నత ర్యాంక్ మధ్యలో 16 గ్రూపులు ఉండగా, గ్రూప్ డి, సి, బి, ఏ ఉద్యోగులు ఉన్నాయి.

వివరాలు 

10 సంవత్సరాలకు ఓసారి కొత్తగా  వేతన సంఘం 

వేతన కమిషన్ సిఫార్సులు ప్రకారం ప్రతి స్థాయి ఉద్యోగి కోసం బేసిక్ పే, ఇతర అలవెన్సులు ఎంత పెరుగుతాయో నిర్ణయిస్తారు. ఈ పెంపు బేసిక్ పేకు వర్తిస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఓసారి వేతన సంఘం కొత్తగా రూపొందించబడుతుంది. 7వ వేతన సంఘం ఈ ఏడాది ముగియనున్నందున, 8వ వేతన సంఘం త్వరలో అమలు కావాల్సి ఉంది. జీతాల పెంపు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందో ఆధారంగా జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు: 6వ వేతన సంఘం కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం జీతం తగినంత పెరుగుతుంది. 7వ వేతన సంఘం కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా ఉంది.

వివరాలు 

లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు కేంద్ర ఉద్యోగుల జీతాల పరిస్థితి

8వ వేతన సంఘం కింద ఈ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎంత పెరుగుతుందో ఇంకా క్లారిటీ లేదు. అంచనాల ప్రకారం లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు కేంద్ర ఉద్యోగుల జీతాల పరిస్థితి ఇలా ఉండవచ్చు: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.15 గా ఉంటే.. లెవెల్ 1 ఉద్యోగి మినిమం బేసిక్ పే రూ. 38,700 కు పెరుగుతుంది. లెవెల్ 2 ఉద్యోగికి రూ. 42,785 పెరగాల్సి ఉంటుంది. లెవెల్ 3,4,5 ఉద్యోగులకు వరుసగా చూస్తే రూ. 46,655; రూ. 54,825; రూ. 62,780 చొప్పున పెరగాల్సి ఉంటుంది.

Advertisement

వివరాలు 

లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు కేంద్ర ఉద్యోగుల జీతాల పరిస్థితి

2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ చొప్పున చూస్తే లెవెల్ -1 ఉద్యోగి బేసిక్ పే రూ. 46,260 కి చేరుతుంది. లెవెల్ 2 ఉద్యోగికి రూ. 51,143 కు చేరాల్సి ఉంటుంది. లెవెల్ 3,4,5 ఉద్యోగుల బేసిక్ పే రూ. 55,769; రూ. 65,535; రూ. 75,044 కు చేరాల్సి ఉంటుంది.

Advertisement