Page Loader
Tax scam: 951 కోట్ల పన్ను స్కామ్.. స్టాంప్ వెండర్లపై వాణిజ్య పన్నుల శాఖ రిమాండ్‌

Tax scam: 951 కోట్ల పన్ను స్కామ్.. స్టాంప్ వెండర్లపై వాణిజ్య పన్నుల శాఖ రిమాండ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2025
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో 318 మంది నకిలీ స్టాంప్ విక్రయదారులు రూ.951.27 కోట్ల పన్ను ఎగవేసినట్లు వాణిజ్య పన్నులశాఖ గుర్తించింది. ఈ వ్యవహారంలో శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇద్దరు నకిలీ వెండర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శాఖ మంత్రి పి. మూర్తి ఉద్యోగుల పనితీరును నెలవారీ సమీక్షిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశాల్లో న్యాయమైన వ్యాపారుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని నకిలీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గత ఏడాది మార్చి 14, జులై 2 తేదీల్లో రాష్ట్ర స్థాయి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆపరేషన్లు చేపట్టారు.

Details

ప్రభుత్వానికి భారీ నష్టం

ఈ నెల 12న మూడోసారి రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నులశాఖ ఇంటెలిజెన్స్‌ సెల్ ఆకస్మిక ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడుల్లో 318 మంది నకిలీ స్టాంప్ విక్రయదారులు రూ.951.27 కోట్ల మేరకు పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. ప్రధానంగా తిరువళ్లూర్ జిల్లాలోని మెట్రో ఎంటర్‌ప్రైజెస్‌లో చెన్నై-2 ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు నిర్వహించింది. ఆ సంస్థ రూ.12.46 కోట్ల ఇన్‌పుట్ పన్నును మోసపూరితంగా తగ్గించినట్లు గుర్తించారు. ఈ కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంస్థ యజమాని జయప్రకాష్, బషీర్ అహ్మద్‌ను శుక్రవారం అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.