మస్క్ ట్విట్టర్ ఖాతాలో మళ్లీ వచ్చిన చేరిన 'పిట్ట'; డోజికాయిన్ లోగో తొలగింపు
తన మాటలు, చేష్టలతో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. మూడు రోజుల క్రితం తన ట్విట్టర్ లోగోని బర్డ్‌ను తొలగించి డోజికాయిన్ సింబర్‌ను పెట్టి అందరనీ ఆశ్యర్యానికి గురిచేశారు. ఈ క్రమంలో విమర్శలు రావడంతో శుక్రవారం డోజికాయిన్ లోగోను తొలగించి పిట్ట లోగోను దాని స్థానంలో భర్తీ చేశారు. డోజికాయిన్ అనేది క్రిప్రో కరెన్సీ. మూడు రోజులు క్రితం డోజికాయిన్ లోగో అయిన డాగ్ మీమ్ బొమ్మను మస్క్ ట్విట్టర్ లోగో స్థానంలో పెట్టడం వివాదాస్పదమైంది. డోజికాయిన్‌లో మస్క్ పెట్టుబడులు పెట్టారు. దీంతో దాని విలువను పెంచేందుకు మస్క్ లోగోను మార్చారని విమర్శలు వెల్లువెత్తాయి.
దావా వేసిన వారి దృష్టిని మరల్చేందుకే మస్క్ లోగోను మార్చారా?
నిజానికి, ట్విట్టర్ బర్డ్ లోగోను మస్క్ మార్చిన తర్వాత వివరణ కూడా ఇచ్చారు. పాత స్క్రీన్‌షాట్‌ను ఒకటి షేర్ చేశారు. మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసి లోగోను డోజీ( డాగ్ మీమ్)గా మార్చాలని అందులో మస్క్ అభిమాని ఒకరు కోరినట్లు ఉంది. ఈ క్రమంలో ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసి, వాగ్ధానం ప్రకారం లోగోను మార్చినట్లు మస్క్ చెప్పారు. మస్క్ చెప్పిన ఈ మాటలు నమ్మ శక్యంగా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో డోజికాయిన్‌లో పెట్టుబడి పెట్టిన వారు మస్క్‌పై దావా వేశారు. అయితే వారి దృష్టిని మరల్చడానికి మస్క్ డోజీ లోగోను మార్చి ఉంటారని అనుమానిస్తున్నారు.