Loading...
Commercial LPG Price Hike: దీపావళికి ముందు షాక్.. వరుసగా మూడో నెలా పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలు
దీపావళికి ముందు షాక్.. వరుసగా మూడో నెలా పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలు

Commercial LPG Price Hike: దీపావళికి ముందు షాక్.. వరుసగా మూడో నెలా పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. నవంబర్ 1, 2026 నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు సవరించాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ముఖ్యంగా వరుసగా మూడో నెల కూడా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం గమనార్హం. అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో గృహ వినియోగదారులకు ప్రస్తుతానికి ఊరట లభించింది.

వివరాాలు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగింది?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ నెలలో దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.

కోల్‌కతాలో అత్యధికంగా రూ.17 పెరగగా, ఢిల్లీలో రూ.10 పెరిగింది. ఢిల్లీలో అక్టోబర్ నెలలో రూ.2,810గా ఉన్న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నవంబర్ 1 నుంచి రూ.2,820కి చేరింది.

అంటే ఒక్కో సిలిండర్‌పై రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక చెన్నైలో అక్టోబర్‌లో రూ.2,983గా ఉన్న ధర తాజాగా రూ.2,994.50కి పెరిగింది.

దీంతో అక్కడ ఒక్కో సిలిండర్‌పై రూ.11.50 భారం పడింది. కోల్‌కతాలో రూ.17 పెరుగుదల నమోదైంది. ముంబై సహా ఇతర నగరాల్లోనూ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

వివరాలు

అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతుండటమే కమర్షియల్ ఎల్‌పీజీ ధరల తాజా పెంపునకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు, అంతర్జాతీయ ధరల్లో హెచ్చుతగ్గులు దేశీయంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు నవంబర్ నెలకు సంబంధించి కొత్త ధరలను ప్రకటించాయి.

ADVERTISEMENT

వివరాలు

హోటళ్లు, రెస్టారెంట్లపై అదనపు భారం

కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థలు వినియోగిస్తుంటాయి.

ఇప్పటికే వంట గ్యాస్, నిత్యావసర వస్తువులు, సిబ్బంది ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారులకు తాజా ధరల పెంపు మరింత భారంగా మారనుంది.

గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే మెనూలోని ఆహార పదార్థాల ధరలను పెంచాలా వద్దా అనేది ఆయా హోటళ్ల యాజమాన్యాల నిర్ణయాలు, వాటి నిర్వహణ ఖర్చులపై ఆధారపడి ఉంటుంది.

మరోవైపు గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో కేంద్రం ఎలాంటి మార్పు చేయలేదు.

ADVERTISEMENT