LOADING...
Anthropic: ఆంత్రోపిక్‌కు షాక్.. ఫ్యాబిల్‌ 5, మిథోస్‌ 5 సేవల నిలిపివేత వెనుక అమెజాన్‌?
ఆంత్రోపిక్‌కు షాక్.. ఫ్యాబిల్‌ 5, మిథోస్‌ 5 సేవల నిలిపివేత వెనుక అమెజాన్‌?

Anthropic: ఆంత్రోపిక్‌కు షాక్.. ఫ్యాబిల్‌ 5, మిథోస్‌ 5 సేవల నిలిపివేత వెనుక అమెజాన్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 14, 2026
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ సంస్థ ఆంత్రోపిక్‌ ఇటీవల విడుదల చేసిన తమ అత్యాధునిక ఏఐ మోడళ్లైన 'ఫ్యాబిల్‌ 5', 'మిథోస్‌ 5' సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక అమెజాన్‌ పాత్ర ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ఈ ఏఐ మోడళ్లలో కొన్ని భద్రతాపరమైన సమస్యలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ఆంథ్రోపిక్‌ ఇటీవల 'ఫ్యాబిల్‌ 5' మోడల్‌ను విడుదల చేసింది. అనంతరం అమెజాన్‌కు చెందిన పరిశోధకులు ఈ మోడల్‌పై ప్రత్యేక పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏఐ మోడళ్లలో సాఫ్ట్‌వేర్ లోపాలను బయటపెట్టకుండా నిరోధించే భద్రతా ఫిల్టర్లు ఉంటాయి.

వివరాలు

సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ కార్యకలాపాలకు పాల్పడే అవకాశం

అయితే అమెజాన్‌ పరిశోధకులు ప్రత్యేక ప్రాంప్ట్‌లను ఉపయోగించి ఫ్యాబిల్‌ 5 మోడల్‌లో భద్రతా నిబంధనలను దాటవేసే కొన్ని సాఫ్ట్‌వేర్ లోపాలను గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అధునాతన ఏఐ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని ట్రంప్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఈ ఏఐ టూల్స్ సహాయంతో సాఫ్ట్‌వేర్ కోడ్‌లలోని బలహీనతలను సులభంగా గుర్తించి, వాటిని హ్యాకర్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది.

వివరాలు

యూఎస్ ప్రభుత్వం ఆదేశాలు

ఈ నేపథ్యంలో ఫ్యాబిల్‌ 5, మిథోస్‌ 5 ఏఐ మోడళ్ల వినియోగాన్ని విదేశీ పౌరులకు నిషేధిస్తూ అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆంథ్రోపిక్‌లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు కూడా ఈ మోడళ్ల యాక్సెస్‌ ఉండకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై స్పందించిన ఆంథ్రోపిక్‌ సంస్థ.. కేవలం విదేశీ పౌరులకే కాకుండా అన్ని వర్గాల యూజర్లకు ఫ్యాబిల్‌ 5, మిథోస్‌ 5 సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement