
Accenture Layoffs: యాక్సెంచర్‌లో 11వేలమంది ఉద్యోగుల తొలగింపు.. త్వరలో మరికొంతమంది?
ఈ వార్తాకథనం ఏంటి
యాక్సెంచర్ (Accenture) సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలకు ప్రాధాన్యత ఇవ్వబోతోంది. కేవలం మూడు నెలల్లోనే 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలిగించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ ఉద్యోగాల కోత వచ్చే ఏడాది నవంబర్ వరకు కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. సంస్థ ఈ మొత్తం ప్రక్రియను "పునర్నిర్మాణ కార్యక్రమం"గా పిలుస్తోంది. యాక్సెంచర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకారం, భవిష్యత్తులో AI కీలక పాత్ర పోషించనుంది. అందుకే ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని సంస్థ కోరుతోంది. ఉద్యోగులు తక్షణమే నైపుణ్యాలను పెంపొందించుకోలేకపోతే, వారిని తొలగించడం తప్పనిసరి అవుతుందని ఆమె స్పష్టం చేశారు.ay
Details
AI సాంకేతికతపై భారీ పెట్టుబడులు
కంపెనీ ఈ పునర్నిర్మాణ కార్యక్రమం కోసం 865 మిలియన్ డాలర్లు (7,669 కోట్లు) ఖర్చు చేయనుంది. గత త్రైమాసికంలో ఉద్యోగుల తొలగింపుతో వచ్చే ఆదా 1 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ, మరోవైపు యాక్సెంచర్ AI సాంకేతికతపై భారీ పెట్టుబడులు పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో AI ప్రాజెక్టుల ద్వారా 5.1 బిలియన్ల డాలర్ల కొత్త ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఇది గత సంవత్సరం తో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. ప్రస్తుతానికి యాక్సెంచర్ వద్ద 77,000 మంది AI, డేటా నిపుణులు ఉన్నారు, ఇది రెండు సంవత్సరాల క్రితం ఉన్న 40,000తో పోలిస్తే రెట్టింపు సంఖ్య.