Page Loader
ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట 
ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట

ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట 

వ్రాసిన వారు Stalin
Jun 14, 2023
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల కదలికలను పసిగట్టే హెన్లీ అండ్ పార్ట్రర్స్ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. ఈ ఏడాది భారతదేశం నుంచి 6,500 మంది మిలియనీర్లు లేదా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐ) భారత్‌ను విడిచి వలస వెళ్తారని 'హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023' పేరుతో విడుదల చేసిన నివేదిక అంచనా వేసింది. గతేడాది 7,500 హెచ్ఎన్ఐలు వలస వెళ్లగా, ఈ సారి సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ న్యూ వరల్డ్ వెల్త్ అంచనాల ఆధారంగా మిలియనీర్ల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోను హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 అంచనా వేసింది.

ధనవంతులు

భారత్‌లో 3.4 లక్షల మంది మిలియనీర్లు 

హెన్లీ అండ్ పార్ట్రర్స్ అధ్యయనం ప్రకారం హెచ్‌ఎన్‌ఐల వలసల పరంగా చైనా తర్వాత భారతదేశం రెండోస్థానంలో ఉంది. 2023లో చైనా నుంచి 13,500మంది మిలియనీర్లు వలస వెళ్లొచ్చని నివేదిక పేర్కొంది. 2022లో చైనా నుంచి 10,800 మంది వలస వెళ్లారు. మిలియనీర్లు వలస వెళ్లే జాబితాలో యూకే 3,200 మందితో మూడోస్థానంలో ఉంటుందని నివేదిక చెప్పింది. హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 3.4 లక్షల మంది మిలియనీర్లు ఉండగా, చైనాలో 7.8 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు. భారతదేశం మిలియనీర్ల సంఖ్య 2031 నాటికి 80 శాతం పెరుగుతుందని అంచనా నివేదిక అంచనా వేసింది.