Page Loader
FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్
FPO రద్దు చేసిన అదానీ ఎంటర్‌ప్రైజెస్

FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 02, 2023
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఊహించని విధంగా జరిగిన పరిణామాల ప్రకారం రూ. 20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)ను రద్దు చేయాలని డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు దాని షేర్లు దాదాపు 30% పడిపోయిన తర్వాత ఇఎఏ నిర్ణయం తెసుకోవడం జరిగింది. ఈ మొత్తాన్ని పెట్టుబడిదారులకు తిరిగి చెల్లిస్తామని, మార్కెట్ అనుకూలంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. స్టాక్ ధర హెచ్చుతగ్గులకు లోనవడంతో ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా, ఈ సమస్యతో ముందుకు సాగడం సరైనది కాదని కంపెనీ బోర్డు భావించిందని అదానీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు.

అదానీ

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తర్వాత SEBI అదానీ గ్రూప్ షేర్లలో భారీ క్రాష్‌పై దర్యాప్తు ప్రారంభించింది

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై 129-పేజీల నివేదికను ప్రచురించిన తర్వాత, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) అదానీ గ్రూప్ షేర్లలో భారీ క్రాష్‌పై దర్యాప్తు ప్రారంభించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, వాటా విక్రయంలో అవకతవకలను పరిశీలించింది. గత వారం, ఆఫ్‌షోర్ షెల్ కంపెనీల సహాయంతో అదానీ గ్రూప్ మార్కెట్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడిందని హిండెన్‌బర్గ్ ఒక నివేదికను ప్రచురించింది. లిస్టెడ్ కంపెనీల స్కై-హై వాల్యుయేషన్‌ల గురించి కూడా అనుమానాలను లేవనెత్తింది. అదానీ గ్రూప్ లీగల్ హెడ్ నివేదికను ద్వేషపూరితమైన చర్యగా పేర్కొని హిండెన్‌బర్గ్ పై చట్టపరమైన చర్యల గురించి ఆలోచిస్తున్నారు.