Page Loader
నేటితో ముగియనున్న ఆధార్‌ పాన్‌ లింక్ గడువు.. మరోసారి పొడిగింపుపై స్పందించని ఐటీశాఖ
నేటితో ముగియనున్న ఆధార్‌ పాన్‌ లింక్ గడువు.. మరోసారి పొడిగింపుపై స్పందించని ఐటీశాఖ

నేటితో ముగియనున్న ఆధార్‌ పాన్‌ లింక్ గడువు.. మరోసారి పొడిగింపుపై స్పందించని ఐటీశాఖ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 30, 2023
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆధార్‌ కార్డుతో పాన్‌ను అనుసంధానించేందుకు గడువు నేటితో ముగియనుంది. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 మేరకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానించాల్సిదే. జులై 1 నుంచి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ ఖాతాలు పని చేయవని గతంలోనే ఐటీ శాఖ వెల్లడించింది. అయితే పాన్‌ - ఆధార్‌ లింక్‌ గడువు ముగిసినప్పటికీ కేంద్రం ఒకసారి పొడిగించింది. ఇప్పుడు రూ.1000 అపరాధ రుసుంతో తొలిసారిగా మార్చి 31 వరకు, అనంతరం జూన్‌ 30 వరకు అదనపు గడువుగా పొడిగింపులు చేశారు. ఇప్పుడు ఆ సమయం కూడా నేటితో (జూన్ 30)తో ముగుస్తోంది.

DETAILS

ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో లింక్ చేసుకోవచ్చు

ఆధార్‌తో పాన్‌ లింక్ కోసం చాలా కాలంగా ఐటీ శాఖ చెబుతున్నప్పటికీ ఇప్పటికీ చాలా మంది సదరు ఆదేశాలను పెద్దగా గుర్తించట్లేదు. ఈ రెండు ప్రధాన కార్డులను అనుసంధానిస్తే కొంతమంది చేస్తున్న అక్రమ ఆర్థిక లావాదేవీలు బహిర్గతం అవుతాయి. అందువల్లే చాలా మంది పాన్‌ కార్డుదారులు ఆధార్‌తో అనుసంధానించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇలా చెక్ చేసుకోండి.. ఆధార్ పాన్ కార్డులు అనుసంధానం చేశామా లేదా అని చెక్ చేయాలనుకుంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకునే అవకాశాన్ని ఆ శాఖ కల్పించింది. ఐటీ వెబ్‌సైట్‌లో లింక్‌ ఆధార్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో అనుసంధానించి ఉంటే, చేసినట్లు సందేశం వస్తుంది. లేదంటే ఫైన్‌ తో అనుసంధానానికి అప్షన్లు కనిపిస్తాయి.