
Onion Price: సగానికి పడిపోయిన ఉల్లి ధర.. సంతోషంలో కస్టమర్స్.. బాధలో రైతులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉల్లిపాయ ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మంచి ఫలితాలను ఇస్తున్నాయి.
డిసెంబర్ 7న ఉల్లి ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించించిన విషయం తెలిసిందే.
నిషేధం విధించిన 2వారాల లోపే ఉల్లి ధరలు 50శాతం తగ్గాయి. రానున్న రోజుల్లో ధరలు ఇంకా తగ్గుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడానికి ముందు లాసల్‌గావ్ ఏఎంపీసీ మార్కెట్‌లో హోల్‌సేల్ ధర కిలోకు రూ. 20-21కి రూ. 39-40 ఉంది.
డిసెంబర్ 7 నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.20 కంటే తక్కువగా ఉంది.
హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.3 వేల నుంచి రూ.1500కి తగ్గడం గమనార్హం. ధరల తగ్గుదలతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లి
నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని రైతుల డిమాండ్
ఉల్లి ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్, మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఉల్లి రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
ఎగుమతి నిషేధం కారణంగా దేశంలో ఉల్లి ధరలు పడిపోయాయి. దీని కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు వాపోతున్నారు.
ప్రస్తుతం ఉల్లిని విక్రయించడం ద్వారా పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఎగుమతి నిషేధ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఉల్లి ఎగుమతులపై 31 మార్చి 2024 వరకు కేంద్రం నిషేధం విధించింది.
నిషేధానికి ముందు ఉల్లి క్వింటాల్‌కు రూ.4500 ఉండగా, నిషేధం తర్వాత ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.1500కు పడిపోయింది.