LOADING...
Air India: ఎయిర్‌ ఇండియా విమానాల పూర్తి రిఫిట్‌ ప్రోగ్రామ్‌.. కొత్త టైమ్‌లైన్‌ వెనుక అర్థమిదే!
ఎయిర్‌ ఇండియా విమానాల పూర్తి రిఫిట్‌ ప్రోగ్రామ్‌.. కొత్త టైమ్‌లైన్‌ వెనుక అర్థమిదే!

Air India: ఎయిర్‌ ఇండియా విమానాల పూర్తి రిఫిట్‌ ప్రోగ్రామ్‌.. కొత్త టైమ్‌లైన్‌ వెనుక అర్థమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 12, 2025
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్‌ ఇండియా తన విమానాల రిఫిట్‌ ప్రోగ్రామ్‌ కోసం మరోసారి కొత్త టైమ్‌లైన్‌ను ప్రకటించింది. వైడ్‌బాడీ విమానాలన్నింటి రిఫిట్‌ను 2028 అక్టోబర్‌ నాటికి పూర్తి చేస్తామని తెలిపింది. అంటే ఇప్పటి నుంచి మూడున్నరేళ్లకు పైగా పడనుంది. 26 బోయింగ్‌, 787 విమానాలలో మొదటిదని సంస్థ తెలిపింది. (VT-ANT) ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, విక్టార్‌విల్లేలో రిఫిట్‌ పనుల్లో ఉంది. ఇది ఈ ఏడాది డిసెంబర్‌లో తిరిగి సర్వీస్‌లోకి రానుంది. ప్రస్తుతం రెండు-క్లాస్‌ కాన్ఫిగరేషన్‌లో (18 బిజినెస్‌, 238 ఎకానమీ సీట్లు) ఉన్న ఈ విమానాలను మూడు-క్లాస్‌గా మార్చుతున్నారు.

Details

కస్టమర్ల నమ్మకాన్ని పెంచడానికి చర్యలు

ఇందులో ప్రీమియం ఎకానమీ క్లాస్‌ ప్రవేశపెట్టడంతో పాటు ప్రతి క్లాస్‌లో కొత్త సీట్లు, అధునాతన ఇన్‌ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్‌, కొత్త కార్పెట్‌, కర్టెన్లు, అప్‌హోల్స్‌ట్రీ, లావేటరీస్‌, గ్యాలీలు తదితరాలను అమర్చనున్నారు. ఇవన్నీ కొత్త ఎయిర్‌ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా ఉండనున్నాయి. గత జూన్‌లో అహ్మదాబాద్‌లో VT-ANB విమానం ప్రమాదానికి గురైన తర్వాత 787 విమానాలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. అంతకుముందు 777 విమానాలు డైవర్షన్‌లు, టాయిలెట్‌ సమస్యలు వంటి కారణాలతో వార్తల్లో నిలిచాయి. ఈ సంఘటనల తర్వాత సంస్థ మొత్తం ఫ్లీట్‌ను చెక్‌ చేసి, షెడ్యూల్‌ సమయపాలన కోసం ఫ్లయింగ్‌ను తగ్గించింది. కస్టమర్ల నమ్మకాన్ని పెంచడానికి పలు చర్యలు చేపట్టింది.

Details

అనౌన్స్‌మెంట్‌లు ఎక్కువ - యాక్షన్‌ తక్కువ

ఇది రిఫిట్‌ ప్రోగ్రామ్‌పై వచ్చిన మొదటి ప్రకటన కాదు. ఇప్పటివరకు పలు సార్లు టైమ్‌లైన్‌లు ఇచ్చినా, సరఫరా గొలుసు సమస్యల కారణంగా అవి వాయిదా పడ్డాయి. 2022 సెప్టెంబర్‌లో ఎయిర్‌ ఇండియా 'విహాన్‌.ఏఐ' పేరుతో ఐదేళ్ల ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్లాన్‌ను ప్రకటించింది. 2022 డిసెంబర్‌లో మొదటి విమానం 2024 మధ్య నాటికి సర్వీస్‌లోకి వస్తుందని చెప్పింది. 2023 ఏప్రిల్‌లో మొదటి దశ (టాక్సీ ఫేజ్‌) పూర్తయిందని ప్రకటించింది. 2023 ఆగస్టులో కొత్త బ్రాండ్‌ ఆవిష్కరణ సమయంలో, రిఫర్బిష్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ 2024 మధ్యలో మొదలవుతుందని తెలిపింది.

Details

ప్లాన్‌-బి

ఈ ఏడాది మార్చిలో మొదటి వైడ్‌బాడీ విమానం ఏప్రిల్‌లో రిఫిట్‌కు వెళ్తుందని చెప్పినా, VT-ANT చివరకు జూలైలో బయల్దేరింది. ప్రస్తుత టైమ్‌లైన్‌ ప్రకారం 2028లో 13 పాత 777 విమానాలు రిఫిట్‌ అయ్యి తిరిగి ఫ్లీట్‌లోకి రావాలి. అప్పటికి పాత 777 విమానాల్లో ఒకటి 22 ఏళ్ల వయసు కలిగి ఉంటుంది. ప్రైవేటైజేషన్‌ సమయంలో ఎయిర్‌ ఇండియాకు 16 పాత 777లు ఉండగా, 3 విమానాలు (B777-200LR) ఇప్పుడు ఫ్లీట్‌ నుండి బయటపడ్డాయి. మిగిలిన 13 విమానాలకు రిఫిట్‌ అవసరం. ఆలస్యం కారణంగా తాత్కాలికంగా కొత్త అప్‌హోల్స్‌ట్రీ, కార్పెట్‌లు అమర్చడం, సీట్ల మరమ్మతు, IFE సిస్టమ్‌ సెట్‌ చేయడం వంటి పనులు చేశారు.

Details

15శాతం వరకూ షెడ్యూల్

కొన్ని విమానాలు ఇప్పటికే సర్వీస్‌లోకి వచ్చాయి. అహ్మదాబాద్‌ ప్రమాదం తర్వాత షెడ్యూల్‌లో 15% వరకు ఫ్లైట్లు రద్దు చేయడం వల్ల సమయపాలన మెరుగుపడింది. ప్రస్తుతం పాకిస్థాన్‌ గగనతలం మూసివేసిన కారణంగా ఎయిర్‌ ఇండియా విమానాలు పొడవైన మార్గంలో ప్రయాణిస్తున్నాయి. న్యారోబాడీ విమానాల రిఫిట్‌ ప్రోగ్రామ్‌ (27 పాత A320neo) గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమై, ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి పూర్తి కానుంది. ఇది మొదట ప్రకటించిన టైమ్‌లైన్‌ కంటే మూడు నెలల ఆలస్యం మాత్రమే. హైదరాబాద్‌లోని GMR MROలో మూడో లైన్‌ జోడించడం ద్వారా ఈ పనిని వేగవంతం చేస్తున్నారు. మిగిలిన రెండు లైన్‌లు హోసూర్‌, నాగ్‌పూర్‌లో ఉన్నాయి.

Details

సరైన ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలం

2022 జనవరిలో టాటా గ్రూప్‌ ఎయిర్‌ ఇండియాను ప్రభుత్వంనుంచి తీసుకుంది. అప్పటి నుండి పలు ప్రకటనలు, వాటి మార్పులు ఈ సంస్థ ముందుగా టైమ్‌లైన్‌ లెక్కచేయకుండా తొందరపడి అనౌన్స్‌మెంట్‌లు చేస్తోందా? లేదా సరైన ప్రాధాన్యం ఇవ్వడంలో విఫలమవుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విమానయాన రంగం సరఫరా సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, ప్రపంచంలోని అనేక సంస్థలు కొత్త ఉత్పత్తులు, రిఫ్రెష్‌ చేసిన విమానాలను సర్వీస్‌లోకి తీసుకొచ్చాయి. ఎయిర్‌ ఇండియా అనేకసార్లు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం, ఆచరణలోకి తీసుకురావడంలో లోపం ఉందనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. గ్లోబల్‌ బ్రాండ్‌గా ఎదగాలని భావించే సంస్థకు ఇది ప్రతిష్టా సమస్యగా మారే అవకాశం ఉంది.