Loading...
Akasa Air Saudi Arabia Flights: సౌదీకి ఆకాసా ఎయిర్‌ విమానాలు బంద్‌.. జనవరి 10 వరకు పొడిగింపు!
సౌదీకి ఆకాసా ఎయిర్‌ విమానాలు బంద్‌.. జనవరి 10 వరకు పొడిగింపు!

Akasa Air Saudi Arabia Flights: సౌదీకి ఆకాసా ఎయిర్‌ విమానాలు బంద్‌.. జనవరి 10 వరకు పొడిగింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల నిలిపివేతను ఆకాసా ఎయిర్‌ మరోసారి పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 10 వరకు జెడ్డా, రియాద్‌ నగరాలకు విమానాలను నడపబోమని ప్రకటించింది. సౌదీలో నెలకొన్న భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అక్కడి భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఎయిర్‌లైన్‌ తెలిపింది.

వివరాలు

7 రోజుల్లో రీఫండ్‌.. అదనపు ఛార్జీలు లేకుండా రీషెడ్యూల్

ఆకాసా ఎయిర్‌ నిర్ణయంతో భారత్‌-సౌదీ అరేబియా మధ్య ప్రయాణించాలనుకునే భారతీయులు, ఎన్నారైలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

విమానాలు రద్దైన ప్రయాణికులు పూర్తి రీఫండ్‌ పొందవచ్చు లేదా ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా ప్రయాణ తేదీలను మార్చుకోవచ్చు.

రీఫండ్‌ ప్రక్రియ ఏడు రోజుల్లో పూర్తవుతుందని సంస్థ వెల్లడించింది.

ట్రావెల్‌ పార్ట్‌నర్ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్‌ లేదా రీషెడ్యూలింగ్‌ కోసం నేరుగా వారినే సంప్రదించాలని సూచించింది.

వివరాలు

రియాద్‌ విమానాశ్రయంపై దాడి తర్వాత భద్రతా ఆందోళనలు

సౌదీ అరేబియాలో భద్రతాపరమైన ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో ఆకాసా ఎయిర్‌ విమానాల నిలిపివేతను పొడిగించింది.

అక్టోబర్‌ 10న రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఓ భారతీయుడు మరణించగా.. పలువురు గాయపడ్డారు.

ఈ ఘటన అనంతరం సౌదీలోని భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత రాయబార కార్యాలయం పలు సూచనలు జారీ చేసింది.

మరోవైపు సౌదీ విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్‌ ప్రకటించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇతర అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా సౌదీకి తమ విమాన సర్వీసుల నిలిపివేతను 2027 ప్రారంభం వరకు పొడిగించాయి.

ADVERTISEMENT