Amara Raja : ఈవీ వాహనాల మార్కెట్లోకి అమరరాజా బ్యాటరీస్
ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీ ఈవీ వాహన మార్కెట్లోకి ప్రవేశించనుంది. తొలుత ఛార్జర్లు, తర్వాత బ్యాటరీ ప్యాక్స్ విభాగంలోకి అడుగు పెట్టనుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించడానికి ఇప్పటికే ప్రణాళికలు రచించనట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తమ లిథియమ్ అయాన్ బ్యాటరీ వ్యాపారాన్ని మూడింతలు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఛార్జర్లు, బ్యాటరీలను తయారు చేసిన తర్వాత ఈవీలను రూపొందించనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ విక్రమాదిత్యా గౌరినేని పేర్కొన్నారు.
రెండు దశాబ్దాలకు పైగా బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్న అమర రాజా
వాహన, టెలికాం, రక్షణ రంగాలకు అవసరమైన బ్యాటరీలను అమర రాజా కంపెనీ రెండు దశాబ్దాలకు పైగా ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రీవీలర్ ఈవీ మార్కెట్ లో అమరరాజాకు వినియోగదారులు ఉన్నాయి. అయితే లిథియం, అయాన్ బ్యాటరీ వ్యాపారం ద్వారా రూ.2.5శాతం మాత్రమే కంపెనీ ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టాలని అమరరాజా భావిస్తోంది. అమరరాజా బ్యాటరీస్ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద 'లిథియమ్ సెల్-బ్యాటరీ ప్యాక్' తయారీ కోసం అతి పెద్ద కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది.