Ola Electric: గుడ్ న్యూస్.. రూ.లక్ష కన్నా తక్కువ ధరకే ఓలా స్కూటర్లు
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. స్వాతంత్య్రం దినోత్సవం రోజున వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఓలా తీసుకొచ్చింది. ఈ రెండు వాహనాల ధరలు రూ. లక్ష లోపే ఉండడం గమనార్హం. ఈ నెల 21 తర్వాత వీటి ధరల్లో కొంచెం మార్పు ఉండే అవకాశం ఉంది. ఓలా ఎక్స్ 1 ఎక్స్ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ముందుకొచ్చింది. 3 కిలోవాట్ హవర్ బ్యాటరీ కావాలంటే ఎక్స్ షోరూం ధర రూ.89,999గా ఉండనుంది. ఈ ధర ఈనెల 21 వరకే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత దీని ధర రూ.99,999 కు పెరగనుంది.
డిసెంబర్ లో ఓలా బైక్స్ డెలవరీలు
2 కిలో వాట్ హవర్ బ్యాటరీ ప్యాకుతో కూడిన ఎస్ 1 ఎక్స్ షోరూం ధర రూ.79,999 ఉండగా, తర్వాతి దీని ధర 89,999 కు పెరుగుతుంది. ఈ బైక్స్ ను డిసెంబర్‌లో డెలివరీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ అనేది రెండో మోడల్‌గా ఉంది. ఇందులో 3 కిలోవాట్ హవర్ బ్యాటరీ ప్యాక్ ధర రూ.99,999 ఉండగా, ఆ తర్వాత 1,09,999గా ఉండనుంది. ఈ బైక్స్ డెలవరీలు సెప్టెంబర్ నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ బైక్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని సంస్థ ప్రకటించింది. ఎస్ 1ఎక్స్ ప్లస్‌లో గరిష్టవేగం 90 కిలోమీటర్లు ఉండగా, బూట్ స్పేస్ 34 లీటర్లుగా ఉంది.