Loading...
Amazon: అమెజాన్‌లో 5 వేల ఉద్యోగాలకు కోత.. 15 గిడ్డంగులు మూసివేత!
అమెజాన్‌లో 5 వేల ఉద్యోగాలకు కోత.. 15 గిడ్డంగులు మూసివేత!

Amazon: అమెజాన్‌లో 5 వేల ఉద్యోగాలకు కోత.. 15 గిడ్డంగులు మూసివేత!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో డెలివరీ విభాగానికి చెందిన సుమారు 5 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో సంస్థ ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు నగర పరిధిలోని 15 గిడ్డంగులను మూసివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మూసివేతకు గురయ్యే గిడ్డంగుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మద్దతు ఇస్తున్న డెలివరీ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టరూపం దాల్చితే అమెజాన్ ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఈ చట్టం అమల్లోకి వస్తే సంస్థ ప్రస్తుత డెలివరీ వ్యవస్థలో మార్పులు చేయాల్సి రావచ్చు.

వివరాలు 

ఎందుకీ ఉద్యోగాల కోతలు?

ఈనేపథ్యంలోనే ఉద్యోగాల కోతలు,గిడ్డంగుల మూసివేత అంశాలు తెరపైకి వచ్చాయి.

ప్రస్తుతం అమెజాన్ తన డెలివరీ సేవల కోసం డ్రైవర్లను నేరుగా నియమించుకోవడం లేదు.

ఇందుకోసం థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లపై ఆధారపడుతోంది.అయితే, న్యూయార్క్‌లో తాజాగా ప్రతిపాదించిన డెలివరీ ప్రొటెక్షన్ బిల్లు ఆమోదం పొందితే ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

ప్రస్తుతం నగరంలో సుమారు 40మంది థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా 5,000మందికి పైగా డెలివరీ కార్మికులు పనిచేస్తున్నారు.

కొత్త చట్టం అమల్లోకి వస్తే వీరిని అమెజాన్ నేరుగా ఉద్యోగులుగా నియమించుకోవాల్సి రావచ్చని తెలుస్తోంది.

అలా చేస్తే సంస్థపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

ఈ ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతోనే డెలివరీ విభాగంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని అమెజాన్ యోచిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

ఎందుకీ ఉద్యోగాల కోతలు?

మరోవైపు, న్యూయార్క్‌లోని గిడ్డంగులను మూసివేస్తే డెలివరీ సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా వినియోగదారులకు వస్తువులు చేరడానికి పట్టే సమయం పెరగడంతో పాటు డెలివరీ ధరలు కూడా అధికమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

అయితే, ఉద్యోగాల కోతలు, గిడ్డంగుల మూసివేతకు సంబంధించిన తుది నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT