LOADING...
Ambani family: దేశంలోనే అత్యంత విలువైన కుటుంబ వ్యాపారం అంబానీలదే.. తర్వాతి స్థానంలో బిర్లా, జిందాల్‌లు
తర్వాతి స్థానంలో బిర్లా, జిందాల్‌లు

Ambani family: దేశంలోనే అత్యంత విలువైన కుటుంబ వ్యాపారం అంబానీలదే.. తర్వాతి స్థానంలో బిర్లా, జిందాల్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్ అంబానీ కుటుంబం మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. హురున్‌ రిపోర్ట్‌-బార్క్లేస్‌ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం,అంబానీ కుటుంబ సంపద విలువ రూ.28 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఈ మొత్తం,రెండో స్థానంలో ఉన్న అదానీ కుటుంబ సంపద అయిన రూ.14.01లక్షల కోట్ల కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ నివేదికలో పేర్కొన్నట్లుగా,దేశంలోని అగ్ర 300 కుటుంబ వ్యాపారాల మొత్తం సంపద 1.6లక్షల కోట్ల అమెరికన్‌ డాలర్లు,అంటే సుమారు రూ.140లక్షల కోట్లుగా ఉంది. ఈ మొత్తం,భారత జీడీపీ కంటే సుమారు 40శాతం ఎక్కువ.కేవలం అంబానీ కుటుంబం సంపదే దేశ జీడీపీలో 12 శాతం వాటా కలిగి ఉంది.

వివరాలు 

,కుమార మంగళం బిర్లా కుటుంబ సంపద 20 శాతం పెరిగింది 

గతేడాదితో పోలిస్తే వారి సంపదలో 10 శాతం పెరుగుదల రావడంతో, అగ్రస్థానాన్ని ఈసారి కూడా కాపాడుకోగలిగారు. అదానీ కుటుంబం, తొలితరం ప్రారంభించిన వ్యాపారాల్లో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారంగా గుర్తింపు పొందింది. మూడో త్రైమాసికంలో,కుమార మంగళం బిర్లా కుటుంబ సంపద 20 శాతం పెరిగి రూ.6.47 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఒక స్థానం పైకెగసి రెండో స్థానంలో నిలిచారు. జిందాల్‌ కుటుంబ సంపద 21 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లకు చేరడంతో మూడో స్థానానికి ఎగబాకింది. ఇక బజాజ్‌ కుటుంబం మాత్రం 21 శాతం సంపద కోల్పోయి రూ.5.64 లక్షల కోట్ల వద్ద నాలుగో స్థానానికి జారిపోయింది.

వివరాలు 

దేశంలోని అగ్ర 300 కుటుంబాలు.. రూ.7,100 కోట్ల సంపద 

గత ఏడాదిలో దేశంలోని అగ్ర 300 కుటుంబాలు ప్రతిరోజూ కలిపి రూ.7,100 కోట్ల సంపద సృష్టించాయి. ఒక బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.8,700 కోట్లు) పైగా సంపద కలిగిన కుటుంబాల సంఖ్య 37 నుంచి 161కు పెరిగింది. వీటిలో సుమారు నాలుగో వంతు వ్యాపారాలు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ కాలేదు. ప్రాంతాల వారీగా చూస్తే.. ముంబయి 91 బిలియనీర్‌ కుటుంబాలతో అగ్రస్థానంలో నిలిచింది. దిల్లీ-ఎన్‌సీఆర్‌ 62 కుటుంబాలతో రెండో స్థానంలో ఉండగా, కోల్‌కతా 25 కుటుంబాలతో మూడో స్థానంలో నిలిచింది.