Ambuja Cements: గ్రీన్ పవర్ ప్రాజెక్టుల్లో అంబుజా సిమెంట్స్ రూ.6,000 కోట్ల పెట్టుబడి
బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్స్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టుల్లో 1000 మెగావాట్ల సామర్థ్యాన్ని సృష్టించే లక్ష్యంతో రూ.6,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంబుజా సిమెంట్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సోమవారం ఈ సమాచారాన్ని కంపెనీ పొందుపర్చింది. ఈ రూ.6వేల కోట్ల పెట్టుబడిని గుజరాత్, రాజస్థాన్‌లలో ఉన్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడుతున్నట్లు ఫైలింగ్‌లో కంపెనీ వివరించింది. ఇందుకోసం గుజరాత్‌లో 600 మెగావాట్ల సోలార్, 150 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్, అలాగే రాజస్థాన్‌లో 250 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిచింది.