అమెరికాలో ఆటో కార్మిక సమ్మె విరమణ.. UAW, ఫోర్డ్ మధ్య కుదిరిన ఒప్పందం
అమెరికాలో యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్ (UAW), ఫోర్డ్ మధ్య వివాదానికి తెరపడింది. దాదాపు ఆరు వారాల సమ్మె తర్వాత దీనికి ముగింపు పడింది. ఈ మేరకు తాత్కాలిక ఒప్పందం జరగడంతో సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక సంఘం ప్రకటించింది. 25శాతం జీతం పెరుగుదలకు కంపెనీ ఒప్పందం చేసుకున్నట్లు బుధవారం సాయంత్రం యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు అత్యధిక వేతనాన్ని గంటకు $40కి పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో ప్రారంభ వేతనాలను గంటకు $28కి పెరిగింది. ఈ లెక్కన 68 శాతం వేతనం పెరిగినట్టైంది. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని వాటిని తాము గెలిచామని UAW ప్రెసిడెంట్ షాన్ ఫెయిన్ అన్నారు. UAW, ఫోర్డ్ మధ్య తాత్కాలిక ఒప్పందం జీవన వ్యయ సర్దుబాటులను స్థిరీకరిస్తోంది.
విధుల్లో చేరిన ఆటో కార్మికులు
ఈ ఒప్పందానికి ఇప్పటికీ అమెరికాలోని స్థానిక UAW నాయకుల నుంచి ఆమోదం లభించింది. యూనియన్ ఆమోదం ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆటో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. ఓటింగ్ ప్రక్రియ ముగుసిన సందర్భంగా ప్రస్తుతం సమ్మెలో ఉన్న ఫోర్డ్ ఆటోవర్కర్లు తిరిగి పనిని ప్రారంభించారని UAW వైస్ ప్రెసిడెంట్ చక్ బ్రౌనింగ్ వెల్లడించారు. ఉత్తమమైన ఒప్పందాన్ని సాధించేందుకు ఇదో వ్యూహాత్మక చర్య అని ఆన స్పష్టం చేశారు. తాము స్టెల్లాంటిస్, GMపై ఒత్తిడిని కొనసాగించేందుకు ఫోర్డ్‌లో తిరిగి పని చేయబోతున్నామన్నారు. ఫోర్డ్ గందరగోళంలో ఉన్నప్పుడు, వెనుకబడి ఉన్నామని, ఇప్పుడు పూర్తి సామర్థ్యాన్ని తిరిగి పొందామని బ్రౌనింగ్ స్పష్టం చేశారు.