LOADING...
Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అనిల్ అంబానీ పేరు.. స్వీడిష్ అందగత్తె సంభాషణపై దేశవ్యాప్తంగా చర్చ!
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అనిల్ అంబానీ పేరు.. స్వీడిష్ అందగత్తె సంభాషణపై దేశవ్యాప్తంగా చర్చ!

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అనిల్ అంబానీ పేరు.. స్వీడిష్ అందగత్తె సంభాషణపై దేశవ్యాప్తంగా చర్చ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌ లైంగిక కుంభకోణం కేసులో తాజాగా మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు తొలిసారి అధికారికంగా ప్రస్తావనకు రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా న్యాయ శాఖ తాజాగా విడుదల చేసిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో అనిల్ అంబానీ పేరు ఉండటం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో భారత వ్యాపారవేత్తకు ఉన్న సంబంధాలపై ఈ పత్రాలు స్పష్టమైన వివరాలను బయటపెట్టాయి. ఎప్‌స్టీన్‌ గ్లోబల్ నెట్‌వర్క్‌ అమెరికా హద్దులు దాటి భారత్‌ వరకు ఎలా విస్తరించిందో ఈ తాజా డాక్యుమెంట్లు హైలైట్ చేస్తున్నాయి.

Details

ఎప్‌స్టీన్‌తో సంప్రదింపులు

2017 నుంచి 2019 మధ్య మైనర్లను లైంగిక చర్యల కోసం అక్రమంగా తరలించారన్న ఆరోపణలతో 2019లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని అరెస్టుకు కొన్ని నెలల ముందు వరకూ అనిల్ అంబానీతో ఎప్‌స్టీన్‌కు పరస్పర సంప్రదింపులు కొనసాగినట్లు తాజా ఫైల్స్ వెల్లడించాయి. అంతర్జాతీయ వ్యవహారాలు, వ్యాపార ఆసక్తులు, వ్యక్తిగత అంశాలు సహా అనేక విషయాలపై ఇరువురు చర్చించుకున్నారని ఈ పత్రాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఎవరికీ తెలియకుండా ప్రైవేట్‌గా కలుసుకోవాలన్న ఆలోచన కూడా ఇద్దరిలో ఉన్నట్లు ఎప్‌స్టీన్ ఫైల్స్ సూచిస్తున్నాయి.

Details

'పొడవైన స్వీడిష్ అందగత్తె' ప్రస్తావన

2017 మార్చి 9న జరిగిన ఒక సంభాషణకు సంబంధించిన వివరాలను కూడా తాజా పత్రాలు బయటపెట్టాయి. అందులో "పొడవైన స్వీడిష్ అందగత్తె మీ రాకను మరింత సరదాగా మార్చేస్తుందని ఎప్‌స్టీన్ అనిల్ అంబానీతో అన్నట్లు పేర్కొన్నారు. దీనికి అంబానీ "ఎర్పాట్లు చేసుకోండి" అంటూ సమాధానం ఇచ్చినట్లు ఫైల్స్ వెల్లడించాయి. అదే సంభాషణలో పారిస్‌లో జరగాల్సిన సమావేశంపై కూడా ఇరువురు చర్చించుకున్నారని పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా, మాన్‌హట్టన్‌లోని అప్పర్ ఈస్ట్ సైడ్‌లో ఉన్న ఎప్‌స్టీన్ నివాసంలో వారిద్దరూ సమావేశమైనట్లు కొందరు సహాయకులు ధ్రువీకరించినట్టు ఈ ఫైల్స్ పేర్కొంటున్నాయి.

Advertisement

Details

ఇతర వివరాలు

ఇదే సమయంలో 2017లో అనిల్ అంబానీ కుటుంబానికి సంబంధించిన అనేక డిజిటల్ పుస్తకాలను ఎప్‌స్టీన్ ఆర్డర్ చేసినట్లు కూడా ఈ పత్రాలు వెల్లడించాయి. వాటిలో అనిల్ అంబానీ మరియు అతని సోదరుడు ముఖేష్ అంబానీ మధ్య వ్యాపార పోటీని వివరించే శీర్షికలు ఉన్న పుస్తకాలు కూడా ఉన్నట్లు సమాచారం. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణానంతరం ఆయన వ్యాపార సామ్రాజ్యం కుమారులు ముఖేష్, అనిల్ అంబానీల మధ్య విభజించబడింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ 98.4 బిలియన్ డాలర్ల నికర ఆస్తితో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు, అనిల్ అంబానీ ఆర్థిక పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా క్షీణించిన సంగతి తెలిసిందే.

Advertisement