Zepto: జెప్టోలో మరో కీలక అధికారి రాజీనామా - లీడర్‌షిప్‌లో మార్పుల హడావిడి
ఈ వార్తాకథనం ఏంటి
జప్టో మీట్ విభాగం సీఈఓగా పనిచేస్తున్న చందన్ రుంగ్టా తన పదవి నుంచి తప్పుకున్నారు. 2023 డిసెంబర్‌లో ఈ బాధ్యతలు స్వీకరించిన ఆయన, సంవత్సరానికి కూడా ముందే రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి వారాల్లో జెప్టో తన మీట్ బిజినెస్‌లో వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మొదట కంపెనీ తన ప్రైవేట్ లేబుల్ 'Relish' ద్వారా మీట్ మార్కెట్‌లో ప్రాముఖ్యత పెంచుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు, ప్రీమియం మరియు మాస్-ప్రీమియం కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్ Licious ను తిరిగి తమ ఉత్పత్తుల జాబితాలోకి చేర్చింది.
వివరాలు
రిలిష్ బ్రాండ్‌తో రూ.480-600 కోట్లు వార్షిక ఆదాయం
జెప్టో ప్రైవేట్ లేబుల్ మీట్ బ్రాండ్ Relish మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది. నెలకు సుమారు ₹40-50 కోట్ల అమ్మకాలు వస్తున్నట్లు సమాచారం. అంటే, సంవత్సరానికి ₹480-600 కోట్ల ఆదాయం వెలువడుతున్నట్లు అర్థం. ఈ సాంకేతిక మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాల నేపథ్యం మొత్తం కంపెనీ Moneycontrol కు ధృవీకరించింది.
వివరాలు
ఇటీవలి వారాల్లో పలువురు సీనియర్ అధికారులు తప్పుకున్న జెప్టో
రుంగ్టాతో పాటు, జెప్టోలో మరికొంతమంది ప్రముఖులు కూడా కంపెనీని వీడుతున్నారు. జెప్టో VP & Head of IT గా ఉన్న చంద్రేశ్ దేధియా కూడా డిసెంబర్ 2024లో చేరి, సంవత్సరానికి లోపే రాజీనామా చేశారు. Senior VP Strategy గా ఉన్న అపూర్వ్ పాండే కూడా కంపెనీని విడిచారు. దీనికంటే ముందుగా Zepto Cafe CXO గా ఉన్న శశాంక శేఖర్ శర్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వివరాలు
ESOP వెస్టింగ్ సైకిల్‌కు దగ్గర్లో ఉండగానే ఎంట్రీ ఉద్యోగులు బయటకు
మధ్యస్థ మేనేజ్‌మెంట్‌లో కూడా రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఇటీవలి నెలల్లో బయటకు వెళ్లినవారిలో.. సీనియర్ డైరెక్టర్ అనంత్ రస్తోగి, బిజినెస్ హెడ్ సురజ్ సిపాని,స్ట్రాటజీ డైరెక్టర్ విజయ్ బంధియా,చీఫ్ ఎక్స్‌పాంశన్ ఆఫీసర్ రోషన్ షేక్ ఉన్నారు. రస్తోగి, షేక్, సిపాని ముగ్గురూ నాలుగేళ్లకు పైగా జెప్టోలో పనిచేశారు. బంధియా 2022లో, జెప్టో చిన్న ప్లేయర్ నుంచి వేగంగా ఎదుగుతున్న సమయానికే కంపెనీలో చేరారు.