Loading...
Anthropic Shares: నాలుగు రోజుల్లోనే కుప్పకూలిన ఆంత్రోపిక్ షేర్లు.. ఇన్వెస్టర్లలో ఆందోళన
నాలుగు రోజుల్లోనే కుప్పకూలిన ఆంత్రోపిక్ షేర్లు.. ఇన్వెస్టర్లలో ఆందోళన

Anthropic Shares: నాలుగు రోజుల్లోనే కుప్పకూలిన ఆంత్రోపిక్ షేర్లు.. ఇన్వెస్టర్లలో ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ అంచనాల మధ్య లిస్టింగ్ అయిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) షేర్లు కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా పడిపోయాయి. ఐపీఓ సమయంలో ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన పొందిన ఈ కంపెనీ షేర్లు.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో క్రమంగా క్షీణించాయి. నవంబర్ 19న ఆంథ్రోపిక్ షేర్లు ఒక్కొక్కటి 83 డాలర్ల ఇష్యూ ధరతో ఐపీఓకు వచ్చాయి. అయితే, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 34.34 శాతం ప్రీమియంతో 111.50 డాలర్ల వద్ద ప్రారంభమయ్యాయి. తొలిరోజు ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు చేయడంతో షేరు ధర ఒక దశలో 115.10 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకింది.

వివరాలు 

బిలియన్ల డాలర్ల సంపద ఆవిరి.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం

దీంతో కంపెనీ షేర్లు మరింత పెరుగుతాయని ఇన్వెస్టర్లు ఆశించారు. కానీ, ఆ ఉత్సాహం ఎక్కువ రోజులు కొనసాగలేదు.

కొద్దిరోజులకే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో షేరు ధర క్రమంగా తగ్గుతూ ఐపీఓ ఇష్యూ ధర కంటే దిగువకు చేరింది.

వరుసగా నష్టాలను చవిచూసిన ఆంథ్రోపిక్ షేర్లు తాజా ట్రేడింగ్ సెషన్‌లో మరింత క్షీణించాయి.

ఒక దశలో 75.61 డాలర్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దీంతో కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు.

అయితే, మార్కెట్ ముగిసే సమయానికి కొంతమేర కోలుకున్న షేరు ధర 81.90 డాలర్ల వద్ద స్థిరపడింది.

అయినప్పటికీ, ఇది ఐపీఓ ఇష్యూ ధర అయిన 83 డాలర్ల కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.

వివరాలు 

బిలియన్ల డాలర్ల సంపద ఆవిరి.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం

ఈ పరిణామంతో కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ కొన్ని బిలియన్ డాలర్ల మేర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రారంభంలో భారీ ప్రీమియంతో లిస్టింగ్ కావడంతో కంపెనీపై ఇన్వెస్టర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అయితే, షేరు ధర ఇంత వేగంగా పడిపోవడం వారిని నిరాశకు గురిచేసింది.

ఏఐ రంగానికి సంబంధించి మార్కెట్లో ఉన్న భారీ అంచనాలు, షేర్ల విలువ ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు, ప్రారంభంలో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు విక్రయించుకోవడం (Profit Booking) వంటివి ఈ పతనానికి కారణమై ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏఐ కంపెనీలపై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో ఆంథ్రోపిక్ షేర్లకు వచ్చిన ఈ ఎదురుదెబ్బ మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT