
పెరిగిన యాపిల్ కంపెనీ విలువ: 3ట్రిలియన్ డాలర్ మైలురాయిని చేరుకున్న సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ప్రోడక్టులకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. యాపిల్ ఫోన్, యాపిల్ వాచ్, యాపిల్ ఇయర్ పాడ్స్ వాడటం అనేది ఒక ఐకానిక్ సింబల్‌గా మారిపోయింది.
ప్రస్తుతం యాపిల్ కంపెనీ విలువ భారీగా పెరిగింది. ఏకంగా 3ట్రిలియన్ మైలురాయిని చేరుకుని చరిత్ర సృష్టించింది.
ప్రపంచంలోని చాలా దేశాల జీడీపీ కంటే యాపిల్ కంపెనీ విలువ ఎక్కువగా ఉందంటే ఎవ్వరికైనా ఆశ్వర్యమేయక మానదు.
పెరుగుతున్న యాపిల్ ఉత్పత్తుల వాడకం, యాపిల్ షేరును ఆమాంతం పెంచేసింది.
నాస్ డాక్‌లో యాపిల్ షేరు విలువ 193డాలర్లకు చేరుకుంది. దీంతో, యాపిల్ సంస్థ విలువ 3.3ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకుంది.
Details
గతంలో 3ట్రిలియన్ మార్కును చేరుకున్న యాపిల్
2022 జనవరిలో ఇంట్రాడే ట్రేడింగ్ లో మొదటిసారి 3 ట్రిలియన్ డాలర్ మార్కును యాపిల్ అందుకుంది. అయితే ఆ సమయంలో 3ట్రిలియన్ మార్కు వద్ద నిలబడలేక చతికిలపడి పోయింది.
3ట్రిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 250లక్షల కోట్లు అన్నమాట. భారత స్టాక్ మార్కెట్ విలువ 296లక్షల కోట్లుగా ఉంది. అంటే భారత స్టాక్ మార్కెట్ విలువలో యాపిల్ కంపెనీ విలువ 80శాతంగా ఉంది.
యాపిల్ కంపెనీ ఇదే లెక్కన దూసుకుపోతే మరికొన్ని రోజుల్లో భారత స్టాక్ మార్కెట్ కి సమానమైన కంపెనీ వ్యాల్యూకు చేరే అవకాశం ఉంది.