Page Loader
ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ డేటా ప్రైవసీలపై యాపిల్ అవగాహన.. కంపెనీ వ్యుహమిదే
యాపిల్ కంపెనీ

ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ డేటా ప్రైవసీలపై యాపిల్ అవగాహన.. కంపెనీ వ్యుహమిదే

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2023
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

హెల్త్ డేటా ప్రైవసీలపై అవగాహన పెంచడానికి యాపిల్ సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ డేటా ప్రైవసీలపై యాపిల్ అవగాహన కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా 24 ప్రాంతాల్లో బ్రాడ్ కాస్ట్, సోషల్ మీడియా, బిల్‌బోర్డ్‌ల సహా వివిధ ప్లాట్ ఫారమ్‌లలో కనిపిస్తుంది. కోల్ కతా, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బిల్‌బోర్డ్‌ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. ఈ ప్రచారంలో ఎమ్మీ అవార్డు విజేత నటి జేన్ లించ్ వాయిస్‌తో రూపొందించిన ప్రకటన ఉండడం విశేషం. హెల్త్ డేటా ప్రైవసీ ప్రాముఖ్యతను బలంగా చెప్పడమే ఈప్రకటన లక్ష్యం. వినియోగదారుల ప్రైవసీ పట్ల అనుసరిస్తున్న విధానాలపై యాపిల్ కంపెనీ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.

Details

యాపిల్‌ కంపెనీ నాలుగు ప్రైవసీ ప్రిన్సిపల్స్‌ను అనుసరిస్తోంది

యాపిల్ కంపెనీ ముఖ్యంగా డేటా మినిమైజేషన్, ఆన్ డివైజ్ ప్రాసెసింగ్, ట్రాన్స్‌పరెన్సీ అండ్ కంట్రోల్, సెక్యూరిటీ వంటి ప్రైవసీ ప్రిన్సిపల్స్ ను అనుసరిస్తోంది. యాపిల్ సర్వర్ లను పంపే హెల్త్ డేటా తగ్గింపు కోసం యాపిల్ డివైజ్‌లోనే హెల్త్ మెట్రిక్స్ ను అందుబాటులోకి చేర్చింది. హెల్త్ యాప్‌లో డిస్ ప్లే అయ్యే ట్రెండ్స్, రెస్టింగ్ హార్ట్ రేట్ వంటివి డివైజ్లోనే కాలిక్యులేట్ కావడంతో ఈ డేటాకు యాపిల్కి యాక్సెస్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా పాస్ కోడ్ లేకుండా హెల్త్ యాప్‌లో స్టోర్ అయిన డేటా యాక్సెస్ చేయడానికి వీలు ఉండదు. 2022 ఆగస్టు నాటికి 95శాతం మంది యాక్టివ్ ఐక్లౌడ్ వినియోగదారులకు యాపిట్ టూ స్టెప్ అథెంటికేషన్ను ఎనేబుల్ చేశారు.