తదుపరి వార్తా కథనం
Apple layoff: ఆపిల్‌లో ఉద్యోగ కోతలు.. సేల్స్ విభాగంపై ప్రభావం
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 25, 2025
10:08 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోతలు చేస్తున్న సంస్థల జాబితాలో ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కూడా చేరింది. అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం, కంపెనీ సేల్స్ విభాగంలో కొంతమంది సిబ్బందిని తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఈ చర్య చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులకే ప్రభావం చూపనుందనీ, మిగతా విభాగాల్లో మాత్రం నియామకాలు యధావిధిగా కొనసాగుతాయని సంస్థ వర్గాలు తెలిపాయి. అదనంగా, ఉద్యోగాలు కోల్పోయిన వారికి కంపెనీ లోపలే ఉన్న ఇతర విభాగాల ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఆపిల్ ప్రత్యేకంగా కల్పించినట్టు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆపిల్‌లో ఉద్యోగ కోతలు
NEW: Apple lays off several dozen employees across its sales division who are focused on selling to enterprises, government agencies and schools. The rare job cuts took place this month. https://t.co/Vdc3oEDRXf
— Mark Gurman (@markgurman) November 24, 2025