Page Loader
Apple music : ఆపిల్ మ్యూజిక్ బుక్.. 100 బెస్ట్ ఆల్బమ్స్‌తో లాంచ్
ఆపిల్ మ్యూజిక్ బుక్.. 100 బెస్ట్ ఆల్బమ్స్‌తో లాంచ్

Apple music : ఆపిల్ మ్యూజిక్ బుక్.. 100 బెస్ట్ ఆల్బమ్స్‌తో లాంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
07:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ మ్యూజిక్ లవర్స్ కోసం కొత్త లిమిటెడ్ ఎడిషన్ హై ఎండ్ కలెక్షన్‌ను ఆపిల్ రిలీజ్ చేసింది. ఈ కలెక్షన్‌లో 100 అత్యుత్తమ మ్యూజిక్ ఆల్బమ్స్ ఉన్న 208 పేజీల పుస్తకం ఉంది. దీని ధర సుమారు 450 డాలర్లు (రూ.38,000) ఉంటుంది. 64GB స్టోరేజ్ కలిగిన 10వ జనరేషన్ ఐప్యాడ్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.34,000 ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆపిల్ మ్యూజిక్ పుస్తకం కంటే ఖరీదైనది. ఈ లిమిటెడ్ ఎడిషన్ పుస్తకం అస్సోలిన్ పబ్లిషింగ్‌తో భాగస్వామ్యంతో విడుదల కానుంది. ఈ పుస్తకం కేవలం 1,500 కాపీలతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిపై ఆపిల్ మ్యూజిక్ లోగో తో పాటు పారదర్శక యాక్రిలిక్ స్లిప్ కేస్ ఉంటుంది.

Details

నవంబర్ 25న రిలీజ్

పుస్తకంలో మెరిసే బంగారు అంచులతో ఆకట్టుకునే పేజీలున్నాయి. ఇవి ప్రతి మ్యూజిక్ కలెక్టర్‌కు నిజమైన అద్భుతంగా నిలుస్తాయి. ఈ పుస్తకం 208 పేజీలతో, ఇందులో ఆపిల్ మ్యూజిక్ అత్యుత్తమ 100 ఆల్బమ్‌ల గురించి లోతైన సమాచారం ఉంది. సంగీత ప్రపంచానికి ఇది ఆపిల్ గొప్ప కానుకగా భావిస్తోంది. ఈ పుస్తకం నవంబర్ 25న విడుదల అవుతుందని, పరిమిత కాపీలలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. 2016లో విడుదలైన 'డిజైన్ బై ఆపిల్ ఇన్ కాలిఫోర్నియా' పుస్తకం వంటి ఈ పుస్తకం కూడా ఒక విలువైన వస్తువుగా మారే అవకాశం ఉంది.