Apple Pay: 'ఆపిల్ పే'.. భారత్‌కు వచ్చేసింది.. యాక్సిస్ బ్యాంక్ కార్డులతో సేవలు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఎట్టకేలకు భారత్‌లో 'ఆపిల్ పే' సేవలను ప్రారంభించింది. మంగళవారం నుంచి ఈ సేవలను దశలవారీగా అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఆపిల్ పేకు తొలి బ్యాంకింగ్ భాగస్వామిగా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. తొలిదశలో యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన అర్హత ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులను మాత్రమే ఆపిల్ పేలో ఉపయోగించుకోవచ్చు. దేశీయ రూపే కార్డులకు ప్రస్తుతం మద్దతు లేదు.ఆపిల్ పే ద్వారా అర్హత ఉన్న వినియోగదారులు ఆన్‌లైన్ కొనుగోళ్లతో పాటు సేవకు మద్దతు ఉన్న టెర్మినల్స్ వద్ద కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయొచ్చు. అయితే ప్రారంభ దశలో అన్ని పేమెంట్ టెర్మినల్స్ వద్ద ఈ సేవ అందుబాటులో ఉండదు.
వివరాలు
యూపీఐ ఆధిపత్యంలో ఆపిల్ పేకు సవాళ్లు
సంబంధిత పేమెంట్ సంస్థ, అక్వైరింగ్ బ్యాంక్ ఆపిల్ పేను సపోర్ట్ చేస్తేనే చెల్లింపు పూర్తవుతుంది. దీంతో తొలిదశలో సేవల ఆమోదం అన్ని చోట్ల ఒకేలా ఉండకపోవచ్చు.
భారత్‌లో ఇప్పటికే యూపీఐ ఆధిపత్యం కొనసాగుతోంది.
బ్యాంకుఖాతాల నుంచి నేరుగా చెల్లింపులు చేసే అవకాశం ఉండటంతో క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ లావాదేవీలు విస్తృతంగా ఉన్నాయి.
దీనికి భిన్నంగా ఆపిల్ పే కార్డు ఆధారిత సేవ కావడంతో దీని ప్రారంభ మార్కెట్ పరిమితంగా ఉండనుంది.
ఇదిలా ఉండగా,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,ఐసీఐసీఐ బ్యాంక్,ఎస్‌బీఐ కార్డ్‌లు ప్రస్తుతం ఆపిల్ పేకు మద్దతు ఇవ్వడం లేదు.
వాణిజ్య నిబంధనలపై చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.
భారత్‌లో పెరుగుతున్న ఐఫోన్ వినియోగదారుల నేపథ్యంలో ఆపిల్ పేకు భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు,కార్డులు జతయ్యే అవకాశం ఉంది.