Loading...
Apple: జూన్ త్రైమాసికంలో ఆపిల్‌కు రికార్డు స్థాయి ఆదాయం.. దాదాపు 110 బిలియన్ డాలర్ల రెవెన్యూ
జూన్ త్రైమాసికంలో ఆపిల్‌కు రికార్డు స్థాయి ఆదాయం.. దాదాపు 110 బిలియన్ డాలర్ల రెవెన్యూ

Apple: జూన్ త్రైమాసికంలో ఆపిల్‌కు రికార్డు స్థాయి ఆదాయం.. దాదాపు 110 బిలియన్ డాలర్ల రెవెన్యూ

వ్రాసిన వారు Moogati Shabari
Jul 31, 2026
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సంస్థ ఆపిల్ జూన్ త్రైమాసికంలో చరిత్రాత్మక ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఐఫోన్‌లు, మ్యాక్ కంప్యూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో కంపెనీ ఆదాయం తొలిసారిగా దాదాపు 109.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం వృద్ధి. అలాగే ఒక్కో షేర్‌పై లాభం (Diluted Earnings Per Share) 29 శాతం పెరిగి 2.02 డాలర్లకు చేరింది. కంపెనీ నుంచి పదవీ విరమణ చేయనున్న సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ, అన్ని భౌగోళిక ప్రాంతాల్లో ఆపిల్ రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసిందని తెలిపారు. ముఖ్యంగా భారత్ సంస్థకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని ఆయన వెల్లడించారు.

వివరాలు

ఐఫోన్ అమ్మకాల్లో 22 శాతం వృద్ధి..

ఆదాయాల సమీక్ష సమావేశంలో (Earnings Call) భారత మార్కెట్ సహా అన్ని ప్రాంతాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తాజా ఐఫోన్ మోడళ్లను ఎక్కువగా కొనుగోలు చేయడంతో, ఐఫోన్ విభాగం ఆదాయం 22 శాతం పెరిగి 54.3 బిలియన్ డాలర్లకు చేరింది.

అదే సమయంలో మ్యాక్ విభాగం కూడా బలమైన ప్రదర్శన కనబరిచింది.

మ్యాక్ ఉత్పత్తుల ఆదాయం 29 శాతం పెరిగి 10.4 బిలియన్ డాలర్లకు చేరడంతో, జూన్ త్రైమాసికానికి ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధిక స్థాయి ఆదాయంగా నిలిచింది.

వివరాలు

నాలుగేళ్ల తర్వాత భారత్‌లో ఐఫోన్ షిప్‌మెంట్‌లకు తొలి ఎదురుదెబ్బ..

ఇక యాప్ స్టోర్, ఐక్లౌడ్, ఆపిల్ మ్యూజిక్, ప్రకటనల వ్యాపారం వంటి సేవలను కలిగి ఉన్న ఆపిల్ సర్వీసెస్ విభాగం 12 శాతం వృద్ధితో 30.7 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది.

అయితే ఈ విభాగం ఆదాయం వాల్ స్ట్రీట్ అంచనాలకు స్వల్పంగా తగ్గింది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్‌లో ఆపిల్ ఐఫోన్ షిప్‌మెంట్‌లు గత ఏడాదితో పోలిస్తే 3 శాతం తగ్గాయి.

దాదాపు నాలుగేళ్ల తర్వాత దేశంలో ఐఫోన్ షిప్‌మెంట్‌లు త్రైమాసిక స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి.

ఈ కాలంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కూడా 10 శాతం క్షీణించడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

భారత్‌లో మ్యాక్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్..

అయితే భారత్‌లో ఐఫోన్ విక్రయాలు తగ్గిన ప్రభావాన్ని, ముఖ్యంగా మ్యాక్ ఉత్పత్తుల బలమైన విక్రయాలతో పాటు ఇతర ఉత్పత్తుల మంచి పనితీరు ద్వారా ఆపిల్ అధిగమించినట్లు కనిపిస్తోంది.

ఆపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కెవన్ పరేఖ్ మాట్లాడుతూ, మ్యాక్‌బుక్ నియో మరియు మ్యాక్‌బుక్ ప్రో సిరీస్‌లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభించడంతో మ్యాక్ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.

అభివృద్ధి చెందిన మార్కెట్లతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా సంస్థ బలమైన వృద్ధిని నమోదు చేసిందని ఆయన తెలిపారు.

ముఖ్యంగా లాటిన్ అమెరికా, భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో రెండంకెల వృద్ధి సాధించినట్లు వెల్లడించారు.

ADVERTISEMENT