
World Markets: హమ్మయ్య.. సుంకాలకు ట్రంప్ బ్రేక్.. దెబ్బకు పుంజుకున్న ఆసియా మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీకార సుంకాల ద్వారా అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను కలిగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నారు.
ట్రంప్ విధించిన ఈ టారిఫ్‌లను తాత్కాలికంగా 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన ఒక అనుకోని ప్రకటన చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న మార్కెట్లు ఈ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నాయి.
వివరాలు
జపాన్ నిక్కీ ఇండెక్స్ 8.2 శాతం మేర లాభం
అమెరికా స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేయగా, ఆసియా మార్కెట్లూ కూడా (Asia Markets) గురువారం రాణిస్తున్నాయి.
ఈ రోజు ట్రేడింగ్‌లో జపాన్ నిక్కీ ఇండెక్స్ 8.2 శాతం మేర లాభపడింది.
అలాగే, ఆస్ట్రేలియా ASX సూచీ 4.7 శాతం, దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్ 4.9 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 2.8 శాతం వరకు పెరిగాయి.
ఇక, చైనా షాంఘై సూచీ మాత్రం స్వల్పంగా 0.6 శాతం లాభంతో కొనసాగుతోంది.