
Ayushman Vay Vandana: 70ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఆయుష్మాన్ వే వందన కార్డ్ .. దీన్ని ఎలా పొందాలంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఆరోగ్య కార్డులు అందిస్తోంది. ఈ హెల్త్ కార్డులు ద్వారా సీనియర్ సిటిజన్లకు ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందుతుంది. ఆయుష్మాన్ వే వందన కార్డ్ అంటే ఏమిటి? ఆయుష్మాన్ వే వందన కార్డ్ అనేది ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY)లో భాగంగా జారీ చేసే ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు కార్డ్. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఎంప్యానెల్ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల వరకు ఫ్రీ వైద్య సేవలు అందించబడతాయి.
వివరాలు
దరఖాస్తుల స్థితి ఎలా ఉంది?
ఈ పథకాన్ని 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 55 కోట్ల మంది ప్రజల్లో 40 శాతం మందికి పైగా ఈ పథకం ద్వారా కవరేజీ లభించింది. ఇక, అక్టోబర్ 29, 2024 నుంచి ఆదాయ ప్రమాణంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులందరూ ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు మొత్తం 65,97,096 దరఖాస్తులు లభించాయి. వీటిలో 64,96,101 దరఖాస్తులు అంగీకరించబడ్డాయి.ఇంకా 96,203 దరఖాస్తులు ప్రాసెసింగ్‌లో ఉండగా, 4,792 దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించబడ్డాయి. ఇప్పటివరకు 434 కార్డులు మాత్రమే పంపిణీ అయ్యాయి. అత్యధిక దరఖాస్తులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్,కేరళ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చాయి.
వివరాలు
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? :
ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఈ అర్హతలు ఉండాలి: భారతదేశ పౌరుడై ఉండాలి వయస్సు 70 సంవత్సరాలు లేదా అంతకు పైగా ఉండాలి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డు (వయస్సు, గుర్తింపు ఆధారంగా) ఆధార్‌కు అనుసంధానించబడిన మొబైల్ నంబర్
వివరాలు
దరఖాస్తు చేయడం ఎలా?
ఈ కార్డును పొందేందుకు రెండు విధాలుగా దరఖాస్తు చేయవచ్చు: మొబైల్ యాప్ ద్వారా /అధికారిక వెబ్‌సైట్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేయడం ఎలా? Google Play Storeలోని ఆయుష్మాన్ యాప్ ను డౌన్‌లోడ్ చేయండి యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి మీ మొబైల్ నంబర్,క్యాప్చా ఎంటర్ చేయండి, OTP ద్వారా వేరిఫికేషన్ చేయండి '70+ Register' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి e-KYC పూర్తి చేయండి అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి లైవ్ ఫోటోను అప్‌లోడ్ చేసి, ఫారమ్ సమర్పించండి కార్డ్‌ను నిమిషాల్లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
వివరాలు
వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయడం ఎలా?
ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి, OTP ద్వారా లాగిన్ అవ్వండి 'Senior Citizens Register (70+)' అనే బ్యానర్‌పై క్లిక్ చేయండి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి OTP లేదా బయోమెట్రిక్ ద్వారా e-KYC పూర్తి చేయండి వివరాలు నింపి 'Agree' ఆప్షన్ ఎంచుకోండి లైవ్ ఫోటోను అప్‌లోడ్ చేసి, ఫారమ్‌ను సమర్పించండి 15 నుండి 20 నిమిషాల్లో మీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు సహాయం అవసరమైతే? ఏదైనా సమస్య ఎదురైతే, ఈ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయవచ్చు: 14555 /1800-11-0770 ఈ సేవలు దేశమంతటా 24x7 అందుబాటులో ఉంటాయి.
వివరాలు
ఎందుకు దరఖాస్తు చేయాలి?
ఈ ఆయుష్మాన్ వే వందన కార్డు వల్ల లక్షలాది రూపాయల వైద్య ఖర్చులు ఆదా చేయవచ్చు. హార్ట్ సర్జరీ, డయాలసిస్, క్యాన్సర్ చికిత్స వంటి ఖరీదైన చికిత్సలు కూడా ఈ పథకం ద్వారా ఉచితంగా అందుతాయి. తద్వారా పెద్దవాళ్లు ఆర్థిక భారం లేకుండా సమయానికి మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, పరిమిత సంఖ్యలో కార్డులు మాత్రమే పంపిణీ అవుతున్నాయి. కాబట్టి ముందుగానే దరఖాస్తు చేయడం ద్వారా ఫ్రీ కవరేజీ పొందడం సులభం.