Silver Rates: బాబోయ్ వెండి.. కిలో ధర మరోసారి భారీగా పెరిగింది
ఈ వార్తాకథనం ఏంటి
వామ్మో.. వెండి ధరలు చూస్తే కళ్లు తిరుగుతున్నాయి! ఈ ఏడాది సిల్వర్ నిజంగానే మెరుపులు సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు కిలో వెండి ధర లక్ష రూపాయల లోపే ఉండేది. కానీ ఏమైందో ఏమో.. ఒక్కసారిగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మొన్నటివరకు రూ.2 లక్షల మార్కును దాటి సరికొత్త రికార్డు నమోదు చేసిన వెండి.. ఇప్పుడు రూ.3 లక్షల స్థాయికి చేరువలోకి వచ్చింది. దీంతో మరో ఆల్‌టైమ్ రికార్డు దిశగా పరుగులు పెడుతోంది. మరోవైపు బంగారం ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. ఈ ధరల పెరుగుదలతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతుండగా.. సామాన్యుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
Details
భారీగా షాకిచ్చిన సిల్వర్ ధరలు
ఈరోజు ఒక్కరోజే కిలో వెండిపై రూ.6,000 పెరిగితే.. తులం బంగారంపై రూ.770 పెరిగింది. సిల్వర్ ధరలు ఈరోజు భారీ షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.6,000 పెరిగి సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర సుమారు రూ.2,40,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్లలో మాత్రం కిలో వెండి ధర రూ.2,54,000 స్థాయిలో అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,40,000 దగ్గర కొనసాగుతోంది.
Details
పది గ్రాముల ధరపై రూ.770 పెంపు
ఇదే సమయంలో బంగారం ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.770 పెరిగి రూ.1,40,020 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.1,28,350కి చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.580 పెరిగి రూ.1,05,020 స్థాయిలో కొనసాగుతోంది. వెండి, బంగారం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే కొనుగోలుదారులపై భారం మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.