LOADING...
 Bajaj Housing Finance: బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అద్బుత రికార్డు.. స్టాక్‌ 114% ప్రీమియంతో మార్కెట్‌లోకి ప్రవేశం

 Bajaj Housing Finance: బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అద్బుత రికార్డు.. స్టాక్‌ 114% ప్రీమియంతో మార్కెట్‌లోకి ప్రవేశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2024
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ మార్కెట్‌లో అద్భుత రికార్డును సాధించింది. సోమవారం లిస్టింగ్‌ జరిగిన ఈ కంపెనీ షేర్లు 114.29 శాతం ప్రీమియంతో మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి. ఇష్యూ ధర రూ.70 కాగా, షేరు రూ.150తో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ మార్కెట్లలో లిస్ట్‌ అవడంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 1.07 లక్షల కోట్లకు చేరుకుంది. గత వారం ముగిసిన ఈ ఐపీఓకు అద్భుత స్పందన లభించింది. మొత్తం 72 కోట్ల షేర్లు ఆఫర్‌ చేయగా, 46 వేల కోట్ల షేర్లకు బిడ్లు నమోదయ్యాయి. ఇది 63.6 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం విశేషం.

Details

గతేడాది లాభంతో పోలిస్తే 38 శాతం వృద్ధి

ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.3,560 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేసింది. దీంతో బజాజ్‌ ఫైనాన్స్‌ సంస్థ దాదాపు రూ.3 వేల కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించింది. హౌసింగ్, కమర్షియల్‌ ప్రాపర్టీల కొనుగోళ్లకు రుణాలు అందిస్తూ ఉన్న బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1731 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఇది గతేడాది లాభంతో పోలిస్తే 38 శాతం వృద్ధిని సూచిస్తుంది.