Bank Holidays 2026: 2026 జనవరిలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు
ఈ వార్తాకథనం ఏంటి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకారం, జనవరి 2026లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉంటాయి. వీటిలో జాతీయ,రాష్ట్ర స్థాయి పండుగలు, అలాగే వారాంతాలైన ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సెలవులు ప్రతి రాష్ట్రంలో ఒకే విధంగా ఉండవని, స్థానిక పండుగల ఆధారంగా రాష్ట్రాల వారీగా తేడాలు ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంక్ బ్రాంచ్‌లు మూసివున్నప్పటికీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయి.
వివరాలు
జనవరి 2026లో ముఖ్యమైన బ్యాంక్ సెలవులు
జనవరి 1: న్యూ ఇయర్ డే / గాన్-న్గై (కొన్ని రాష్ట్రాలు) జనవరి 2: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ / మన్నం జయంతి జనవరి 12: స్వామి వివేకానంద జయంతి జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ్ బిహు జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం/పొంగల్/ మాఘే సంక్రాంతి జనవరి 16: తిరువళ్లువర్ డే (ప్రధానంగా తమిళనాడు) జనవరి 17: ఉజవర్ తిరునాళ్ జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి / సరస్వతీ పూజ / బసంత పంచమి జనవరి 26: రిపబ్లిక్ డే (జాతీయ సెలవు - అన్ని రాష్ట్రాలు)
వివరాలు
వీకెండ్స్ (బ్యాంక్ సెలవులు)
జనవరి 4: ఆదివారం జనవరి 10: రెండో శనివారం జనవరి 11: ఆదివారం జనవరి 18: ఆదివారం జనవరి 24: నాలుగో శనివారం జనవరి 25: ఆదివారం మీ రాష్ట్రం లేదా నగరానికి సంబంధించిన ఖచ్చితమైన బ్యాంక్ సెలవుల జాబితా తెలుసుకోవడానికి సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ లేదా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. అదనంగా, చెక్ క్లియరెన్స్, లోన్ పేమెంట్స్ వంటి ఆర్థిక లావాదేవీలు ముందుగా ప్లాన్ చేసుకోవడం నిపుణులు తగిన సూచనగా చెప్పుతున్నారు.