Page Loader
Bank Holidays: ఫిబ్రవరిలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..? 
ఫిబ్రవరిలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..?

Bank Holidays: ఫిబ్రవరిలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 సంవత్సరంలో మొదటి నెల మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి మాసం ప్రారంభం కావడంతో పాటు, బ్యాంకులు దాదాపు 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు ఉండడం తెలిసిందే. ఈ మేరకు, బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ప్రస్తుతం, ఎక్కువగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్నీ పనులు ఆన్లైన్ ద్వారా జరగుతున్నాయి. అయితే, ఆర్థిక సంబంధిత పనుల కోసం మరీ తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. బ్యాంకులకు వెళ్లే ముందు, ఏ రోజులు బ్యాంకులు పనిచేస్తున్నాయో, ఎప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వివరాలు 

అందుబాటులో  ఏటీఎంలు 

లేదంటే, అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సాధారణ సెలవులు, పండుగ సెలవులు కలిపి, ఫిబ్రవరిలో బ్యాంకులకు 14 రోజుల సెలవులు ఉంటాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా డబ్బులు పంపించవచ్చు. అలాగే, నగదు తీసుకోవడానికి ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. కొన్ని బ్యాంకులు క్యాష్ డిపాజిట్ మిషన్లను కూడా ప్రారంభించాయి, దాంతో ఖాతాల్లో డబ్బులు జమచేయడానికి సౌకర్యం ఉంది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉంటే, బ్యాంకుల సెలవుల వివరాలను ముందుగా తెలుసుకోవడం ద్వారా పనులు సజావుగా సాగించేందుకు అవకాశమవుతుంది.

వివరాలు 

ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవులు ఇవే.. 

ఫిబ్రవరి 2 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత. ఫిబ్రవరి 3 : సరస్వతి పూజ సందర్భంగా అగర్తలలో బ్యాంకులకు హాలీడే. ఫిబ్రవరి 8 : రెండో శనివారం సందర్భంగా సెలవు. ఫిబ్రవరి 9 : ఆదివారం సందర్భంగా హాలీడే. ఫిబ్రవరి 11 : థై పోసమ్​ సందర్భంగా చెన్నైలో మూసివేత. ఫిబ్రవరి 12 : శ్రీరవిదాస్​ జయంతి నేపథ్యంలో షిమ్లాలో సెలవు. ఫిబ్రవరి 15 : లుయ్ గై ని పండుగ సందర్భంగా ఇంఫాల్‌లో హాలీడే. ఫిబ్రవరి 16 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్‌ ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహరాజ్​ జయంతి సందర్భంగా ముంబయి, నాగ్‌పూర్‌లో సెలవు. ఫిబ్రవరి 20 : స్టేట్​హుడ్​ డే సందర్భంగా అరుణాచల్‌ప్రదేశ్‌ ఈటానగర్‌లో బ్యాంకులకు సెలవు.

వివరాలు 

ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవులు ఇవే.. 

ఫిబ్రవరి 22 : నాలుగో శనివారం కావడంతో బ్యాంక్​లకు సెలవు. ఫిబ్రవరి 23 : ఆదివారం బ్యాంకుల మూసివేత. ఫిబ్రవరి 26 : మహాశివరాత్రి సందర్భంగా ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో సెలవులు. ఫిబ్రవరి 28 : లోసర్​ సందర్భంగా గ్యాంగ్​టక్​లోని బ్యాంక్​లకు సెలకు హాలీడే.