
Bank Holidays In April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లకు వరుస సెలవులు.. మీ పనులు ముందే ప్లాన్ చేసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ నెల ప్రారంభంకావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.
స్కూల్లు, కాలేజీలు పరీక్షలు ముగించుకుని విద్యార్థులు హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తారు. ఇక బ్యాంక్ సెలవుల విషయానికి వస్తే, ఏప్రిల్ 1, 2025న బ్యాంకులు మూతబడనున్నాయి.
దీనికి కారణం పాత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖాతాలను మూసివేసే పనులు జరగడం.
ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా ప్రకటించింది.
Details
మొత్తం 14 రోజులు సెలవులు
ఇది మాత్రమే కాదు ఏప్రిల్ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులు సెలవులో ఉంటాయి.
ఈ సెలవులలో శ్రీ రామ నవమి, అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి పండుగలు, నాలుగు శనివారాలు, ఇక ఆదివారాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.
Details
ఏప్రిల్ 2025లో బ్యాంక్ సెలవుల జాబితా
ఏప్రిల్ 1 (మంగళవారం) - ఆర్థిక సంవత్సరపు ముగింపు పనుల కారణంగా బ్యాంకులు మూత.
ఏప్రిల్ 6 (ఆదివారం) - శ్రీ రామ నవమి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 10 (గురువారం) - మహావీర్ జయంతి కారణంగా బ్యాంకులు పని చేయవు. ఏప్రిల్ 12
(శనివారం) - రెండో శనివారం, అందువల్ల బ్యాంకులు మూత.
ఏప్రిల్ 13(ఆదివారం) - ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు.
ఏప్రిల్ 14 (సోమవారం) - అంబేద్కర్ జయంతి కారణంగా ప్రభుత్వ సెలవు.
ఏప్రిల్ 15 (మంగళవారం) - బోహాగ్ బిహు సందర్భంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కోల్‌కతా, సిమ్లాలో బ్యాంక్ సెలవు.
ఏప్రిల్ 16 (బుధవారం) - బోహాగ్ బిహు కారణంగా గౌహతిలో బ్యాంకులు మూత.
Details
ఏప్రిల్ 2025లో బ్యాంక్ సెలవుల జాబితా 1/2
ఏప్రిల్ 18 (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవు.
ఏప్రిల్ 20 (ఆదివారం) - ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు.
ఏప్రిల్ 21 (సోమవారం) - గరియా పూజ కారణంగా అగర్తలాలో బ్యాంక్ సెలవు.
ఏప్రిల్ 26 (శనివారం) - నాలుగో శనివారం, బ్యాంకింగ్ కార్యకలాపాలు ఉండవు.
ఏప్రిల్ 27 (ఆదివారం) - ఆదివారం కావడంతో బ్యాంకులు మూత.
ఏప్రిల్ 29 (మంగళవారం) - శ్రీ పరశురామ జయంతి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవు.
ఏప్రిల్ 30 (బుధవారం) - బసవ జయంతి & అక్షయ తృతీయ కారణంగా కర్ణాటకలో బ్యాంకులు మూత.
Details
ప్రాంతీయంగా మారే బ్యాంక్ సెలవులు
ప్రతి రాష్ట్రంలో బ్యాంక్ సెలవులు స్థానిక పండుగల ఆధారంగా మారవచ్చు. కొన్ని సెలవులు దేశవ్యాప్తంగా అమలులో ఉంటే, కొన్ని కేవలం నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే వర్తిస్తాయి.
కాబట్టి, ఏప్రిల్ నెలలో మీకు బ్యాంక్ సంబంధిత పనులు ఉంటే, ముందుగా సెలవుల లిస్ట్‌ను చెక్ చేసుకోవడం మంచిది.