Page Loader
Bank Holidays in April: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌ నెలలో సగం రోజులు బ్యాంకులు బందే..! 
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌ నెలలో సగం రోజులు బ్యాంకులు బందే..!

Bank Holidays in April: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌ నెలలో సగం రోజులు బ్యాంకులు బందే..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక్కపుడు బ్యాంక్‌కి వెళ్లకపోతే ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఉండేది. అయితే, సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత మొబైల్‌ ద్వారా దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే వీలుంది. కానీ, బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందాలన్నా, లాకర్‌లో విలువైన వస్తువులను భద్రపరచాలన్నా, తప్పనిసరిగా బ్యాంక్‌కు వెళ్లాల్సిందే. వీటితో పాటు మరెవైనా అవసరాల కోసం బ్యాంక్‌కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే, ముందుగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. అదే రోజు బ్యాంక్‌కు సెలవు అని తెలిస్తే, అనవసర అసౌకర్యానికి గురికావచ్చు. అందుకే, బ్యాంక్‌ శాఖలు పనిచేసే రోజులను ముందుగా తెలుసుకోవడం అవసరం. ముఖ్యంగా, ఏప్రిల్‌ నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు ఉండనున్నాయి.

వివరాలు 

15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

దేశవ్యాప్తంగా శనివారం, ఆదివారాలతో కలిపి దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. అయితే, రాష్ట్రానికో ప్రత్యేక పండుగల కారణంగా, రాష్ట్రాలకు మధ్య సెలవుల్లో తేడా ఉండొచ్చు. ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సర ప్రారంభ దినోత్సవం సందర్భంగా ఖాతాల సర్దుబాటు పనుల కారణంగా బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించవు. ఇక ఏప్రిల్‌ 5న బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి, 14న అంబేడ్కర్‌ జయంతి, 18న గుడ్‌ ఫ్రైడే సందర్భంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు జగ్జీవన్‌రామ్‌ జయంతి మినహా, ఏప్రిల్‌ 1, 14, 18 తేదీల్లో బ్యాంక్‌లు పనిచేయవు. శని, ఆదివారాలను కలిపితే, ఏప్రిల్‌ నెలలో తెలంగాణలో మొత్తం 11 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 10 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి.