LOADING...
Bank Holidays: డిసెంబర్ లో సగం రోజులకి పైగా మూతపడనున్న బ్యాంకులు.. సెలవుల పూర్తి జాబితా ఇదే..!
డిసెంబర్ లో సగంరోజులకి పైగా మూతపడనున్నబ్యాంకులు..సెలవుల పూర్తిజాబితా ఇదే..!

Bank Holidays: డిసెంబర్ లో సగం రోజులకి పైగా మూతపడనున్న బ్యాంకులు.. సెలవుల పూర్తి జాబితా ఇదే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసింది. డిసెంబర్ నెలలో బ్యాంకులు సుమారు 18 రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ప్రతీ నెలలో బ్యాంకులకు కొన్ని ప్రత్యేక సెలవులు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆర్థిక సంబంధిత పనుల కోసం బ్యాంకులకు వెళ్లేవారు, ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయో లేదా సెలవులో ఉంటాయో ముందుగానే తెలుసుకోవడం ఉపయోగకరం.

వివరాలు 

నగదు అవసరానికి ఏటీఎంలు

సాధారణ సెలవులు, పండుగ సెలవులు కలిపి, డిసెంబర్‌లో మొత్తం 18 రోజులు బ్యాంకులు మూతబడనున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI వంటి డిజిటల్ సర్వీసులు నిరంతరంగా అందుబాటులో ఉంటాయి. వీటితో మీరు డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. నగదు అవసరానికి ఏటీఎంలు కూడా అందుబాటులో ఉంటాయి. కొన్ని బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం ప్రత్యేక మెషిన్లను కూడా ఏర్పాటు చేస్తాయి, వాటి ద్వారా అకౌంట్‌లో డబ్బులు జమ చేసుకోవచ్చు. అయితే, కొన్ని సేవల కోసం బ్యాంక్‌ ఫిజికల్‌గా వెళ్లడం తప్పనిసరి అవుతుంది. ఈ రకమైన సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్నట్లయితే, అవసరమైన పనులను ముందుగా పూర్తిచేయడం సులభం అవుతుంది.

వివరాలు 

సెలవుల జాబితా ఇదే.. 

డిసెంబర్ 1 : అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌ రాష్ట్ర అవరతణ దినోత్సవం సందర్భంగా సెలవు డిసెంబర్ 3 : సెయింట్ జేవియర్ పండుగ సందర్భంగా గోవాలో సెలవు. డిసెంబర్ 7 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా హాలీడే. డిసెంబర్ 12 : సంగ్మా పుణ్యతిథి నేపథ్యంలో మేఘాలయలో బ్యాంకుల బంద్‌. డిసెంబర్ 13 : రెండో శనివారం కావడంతో హాలీడే. డిసెంబర్ 14 : ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత. డిసెంబర్ 18 : ఉసోసో థామ్ పుణ్యతిథి సందర్భంగా మేఘాలయలో హాలీడే. డిసెంబర్ 19 : విముక్తి దినోత్సవం సందర్భంగా గోవాలో బ్యాంకులకు సెలవు.

Advertisement

వివరాలు 

సెలవుల జాబితా ఇదే.. 

డిసెంబర్ 20 : లూసూంగ్, నామ్సూంగ్ పండుగ సందర్భంగా సిక్కీంలో బ్యాంకుల మూసివేత. డిసెంబర్ 21 : ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్‌. డిసెంబర్ 22 : లుసూంగ్, నామ్సూంగ్ పండుగల సందర్భంగా సిక్కీంలో హాలీడే. డిసెంబర్ 24 : క్రిస్మస్ ఈవ్ సందర్భంగా నాగాలాండ్‌, మేఘాలయలో బ్యాంకుల మూసివేత. డిసెంబర్ 25 : క్రిస్మస్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీడే. డిసెంబర్ 26 : క్రిస్మస్ సందర్భంగా మిజోరాం, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో సెలవులు. డిసెంబర్ 27 : నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవులు. డిసెంబర్‌ 28 : ఆదివారం కావడంతో బ్యాంకుల మూసివేత డిసెంబర్ 30 : యుకియాంగ్ నంగ్బా పుణ్యతిథి నేపథ్యంలో మేఘాలయలో సెలవులు. డిసెంబర్ 31 : న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా మిజోరాం, మణిపూర్‌లో హాలీడే.

Advertisement