Bank Holiday March 2026: మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి నెల రేపటితో ముగియనుంది. ఆ వెంటనే మార్చి నెల ఆరంభం కానుంది. రాబోయే నెలలో బ్యాంకులకు భారీ సంఖ్యలో సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో Reserve Bank of India (ఆర్ బి ఐ) మార్చి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం మార్చి నెలలో మొత్తం 18 రోజులు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి చెక్ క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్ తయారీ, రుణాలకు సంబంధించిన ప్రక్రియలు లేదా ఇతర అత్యవసర బ్యాంకింగ్ సేవల కోసం మీరు వచ్చే నెలలో బ్రాంచ్‌ను సందర్శించాలని భావిస్తే, ముందుగానే సెలవుల వివరాలను పరిశీలించడం అవసరం.
వివరాలు
మార్చి నెలలో మొత్తం ఐదు ఆదివారాలు
ఆర్‌బీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం, మార్చి 2026లో అన్ని ఆదివారాలు, అలాగే రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులు మూసివేయబడతాయి. అదనంగా మార్చి 2, 3, 4, 13, 17, 19, 20, 21, 26, 27, 31 తేదీలను కూడా సెలవులుగా ప్రకటించింది. ఈసారి మార్చి నెలలో మొత్తం ఐదు ఆదివారాలు ఉన్నాయి. అవి మార్చి 1, 8, 15, 22, 29 తేదీలు. ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. అయితే సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల ద్వారా కొన్ని అత్యవసర లావాదేవీలు, ఇతర అవసరమైన పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చని గుర్తుంచుకోవాలి.
వివరాలు
మార్చిలో బ్యాంకు సెలవుల లిస్ట్
మార్చి 1 -ఆదివారం- దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ మార్చి 2 - హోలికా దహన్ కారణంగా కాన్పూర్, లక్నోలోని బ్యాంకులకు సెలవు మార్చి 3- హోలీ రెండో రోజు అలాగే బేలాపూర్, భోపాల్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, రాంచీ, విజయవాడలలో బ్యాంకులకు సెలవు మార్చి 4- అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇంఫాల్, ఇటానగర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లాలోని బ్యాంకులు బంద్. మార్చి 8 - ఆదివారం మార్చి 13- చాప్చర్ కుట్ కారణంగా ఈ రోజుఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు.
వివరాలు
మార్చిలో బ్యాంకు సెలవుల లిస్ట్
మార్చి 14- నెలలో రెండవ శనివారం.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు. మార్చి 15 -ఆదివారం సెలవు మార్చి 17 - షబ్-ఎ-ఖాదర్ కారణంగా జమ్మూ అండ్ శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు. మార్చి 19- గుడి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినం. బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్, విజయవాడలో బ్యాంకులు బంద్. మార్చి 20 -ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)/జుమాత్-ఉల్-విదా కారణంగా జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడలలోని బ్యాంకులకు సెలవు. మార్చి 21 - రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) (షావల్-1)/ఖుతుబ్-ఎ-రంజాన్/సర్హుల్ కారణంగా కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం, విజయవాడ మినహా అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవు. మార్చి 22 - ఆదివారం సెలవు
వివరాలు
మార్చిలో బ్యాంకు సెలవుల లిస్ట్
మార్చి 26 -శ్రీరామ నవమి. ఈ కారణంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, చండీగఢ్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, రాంచీ, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు. మార్చి 27 - శ్రీరామ నవమి (చైతి దాసైన్) సందర్భంగా భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, పాట్నా, విజయవాడలలోని బ్యాంకులకు సెలవు. మార్చి 28 - నెలలో నాల్గవ శనివారం.. అన్ని బ్యాంకులకు సెలవు మార్చి 29- ఆదివారం మార్చి 31- మహావీర్ జన్మకల్యాణక్/మహావీర్ జయంతి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీలలో బ్యాంకులకు సెలవు