LOADING...
Stock Market: బేర్‌ రీఎంట్రీ.. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి, సూచీలు పతనం
బేర్‌ రీఎంట్రీ.. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి, సూచీలు పతనం

Stock Market: బేర్‌ రీఎంట్రీ.. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి, సూచీలు పతనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్ గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో కీలక గ్యాస్‌, చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు జరపడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సరఫరా అంతరాయాలపై ఆందోళనల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు మూడు శాతం పెరిగి 111 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో దేశీయ సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,680.13 పాయింట్లు క్షీణించి 75,024.00 వద్ద ఉండగా, నిఫ్టీ 530.40 పాయింట్లు పడిపోయి 23,247.40 వద్ద కొనసాగుతోంది.

వివరాలు

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.89

ఇదే సమయంలో రూపాయి జీవనకాల కనిష్ఠానికి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.89గా నమోదైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌ గ్రిడ్‌ మినహా మిగతా అన్ని స్టాక్స్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఎటర్నల్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు భారీగా క్షీణించాయి. ఈ పరిణామాలతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ దాదాపు రూ.7 లక్షల కోట్లు ఆవిరైంది.

వివరాలు

మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణాలు

ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. దీని ప్రభావంతో అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అదే ప్రభావంతో గురువారం ఆసియా మార్కెట్లు కూడా క్షీణించాయి. జపాన్‌ నిక్కీ 2.74 శాతం, దక్షిణ కొరియా కొస్పి 2.50 శాతం పడిపోయాయి. గత మూడు రోజులుగా లాభాల్లో కొనసాగిన మార్కెట్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా నష్టాలకు కారణమైంది. ప్రీ-ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌ 1900 పాయింట్లకు పైగా కుంగింది. ఖతార్‌లోని కీలక పారిశ్రామిక కేంద్రం రాస్ లాఫాన్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇది ఖతార్‌ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించబడుతుంది.

Advertisement

వివరాలు

ల్‌ఎన్‌జీలో సుమారు 47 శాతం ఖతార్‌ నుంచే

ఈ దాడితో గ్యాస్‌ సరఫరాపై అనిశ్చితి పెరిగింది. ప్రత్యేకంగా భారత్‌కు ఇది ఆందోళనకర పరిణామంగా మారింది. ఎందుకంటే ఫర్టిలైజర్స్‌, సీఎన్‌జీ, పీఎన్‌జీ అవసరాల కోసం రాస్‌ లఫాన్‌ గ్యాస్‌ క్షేత్రంపై భారత్‌ అధికంగా ఆధారపడుతోంది. దేశం దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీలో సుమారు 47 శాతం ఖతార్‌ నుంచే వస్తుండటంతో, ఈ దాడి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశముంది.

Advertisement