Behari Lal Engineering Ltd IPO: బెహరీ లాల్ ఇంజినీరింగ్ ఐపీఓ జోరు.. 63% ప్రీమియం లిస్టింగ్‌తో భారీ లాభాలు
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్లలో ఇటీవల వస్తున్న ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. వరుసగా విజయవంతమైన ఐపీఓలు రావడంతో వాటిలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు దక్కుతున్నాయి. అద్విత్ జువెల్స్, కుసుమ్‌గార్ లిమిటెడ్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, అర్డీ ఇండస్ట్రీస్, ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్, ఇండో ఎంఐఎం వంటి ఐపీఓలు భారీగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఈ వారంలో వచ్చిన ధూత్ ట్రాన్స్‌మిషన్, మోల్‌బయో డయాగ్నోస్టిక్స్, మిల్కీ మిస్ట్ ఐపీఓలు కూడా ఇన్వెస్టర్లకు ఆకట్టుకునే రాబడిని అందించాయి. వీటిలో చాలా వరకు కనీసం 20 శాతానికి పైగా ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ కావడంతోపాటు, ఆ తర్వాత కూడా మరింత పుంజుకున్నాయి.
వివరాలు
ఆగస్ట్ 12 నుంచి 14 వరకు బెహరీ లాల్ ఇంజినీరింగ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్
ఇదే జోరును బుధవారం సెషన్‌లో బెహరీ లాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఐపీఓ కొనసాగించింది.
ఇతర ఐపీఓలతో పోలిస్తే మరింత మెరుగైన రాబడిని అందిస్తూ ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది.
కంపెనీ ఐపీఓ ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.285గా నిర్ణయించింది.
అయితే ఎన్ఎస్ఈలో షేరు ఏకంగా 63.16శాతం ప్రీమియంతో రూ.465 వద్ద లిస్టయింది.
బెహరీ లాల్ ఇంజినీరింగ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ ఆగస్ట్ 12 నుంచి 14 వరకు కొనసాగింది.
ఈ సమయంలో ఐపీఓకు 118.27రెట్ల భారీ సబ్‌స్క్రిప్షన్ లభించింది.
ఆగస్ట్ 17న షేర్ల అలాట్‌మెంట్ పూర్తికాగా,ఆగస్ట్ 19న స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ జరిగింది.
ఐపీఓకు ఒక్కో షేరుకు రూ.271నుంచి రూ.285వరకు ప్రైస్ బ్యాండ్ నిర్ణయించగా,చివరకు గరిష్ఠ ధర అయిన రూ.285 వద్ద ఇష్యూ ఖరారైంది.
వివరాలు
ఒక్కో లాట్‌పై లిస్టింగ్ సమయంలోనే రూ.9,360 లాభం
ఐపీఓలో ఒక్కో లాట్‌కు 52 షేర్లను కేటాయించారు.
దీంతో ఇష్యూ ధర ప్రకారం ఒక లాట్ కొనుగోలు చేయడానికి కనీసం రూ.14,820 పెట్టుబడి అవసరమైంది.
లిస్టింగ్ సమయంలో ఒక్కో షేరు రూ.465కు చేరడంతో 52 షేర్ల విలువ రూ.24,180కి పెరిగింది.
అంటే ఒక్కో లాట్‌పై లిస్టింగ్ సమయంలోనే రూ.9,360 లాభం వచ్చినట్లయింది.
దీంతో షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్లు మంచి లాభాలను అందుకున్నారు.
అయితే బెహరీ లాల్ ఇంజినీరింగ్ షేరు దూకుడు లిస్టింగ్‌తోనే ఆగలేదు. స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్న సమయంలోనూ ఈ షేరు మరింత పైకి దూసుకెళ్లింది.
లిస్టింగ్ అయిన కొద్దిసేపటికే రూ.529 గరిష్ఠ స్థాయిని తాకింది.
వివరాలు
కంపెనీ ఫ్రెష్ ఇష్యూ కింద 32,63,157షేర్ల జారీ
ఇష్యూ ధర రూ.285తో పోలిస్తే ఇది 85 శాతానికి పైగా పెరుగుదల. ఈ స్థాయిలో 52 షేర్ల విలువ రూ.27,508కి చేరింది.
అంటే ఒక్కో లాట్‌పై పెట్టుబడిదారులకు రూ.12,688 వరకు లాభం లభించినట్లయింది.
సుమారు రూ.302కోట్ల నిధులను సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఐపీఓ ఇంత భారీగా దూసుకెళ్లడం మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
కంపెనీ ఫ్రెష్ ఇష్యూ కింద 32,63,157షేర్లను జారీ చేసింది.
అలాగే ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా మరో 73,20,001షేర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బెహరీ లాల్ ఇంజినీరింగ్ ఐపీఓకు లభించిన భారీ స్పందన,లిస్టింగ్ తర్వాత నమోదైన గణనీయమైన లాభాల నేపథ్యంలో తదుపరి మార్కెట్లోకి రానున్న లలితా జువెల్లరీ ఐపీఓపై ఇన్వెస్టర్ల దృష్టి మరింత పెరిగింది.