LOADING...
PM Modi: ప్రధాని మోదీ వర్క్ ఫ్రం హోమ్ పిలుపుతో బెంగళూరు రియల్ ఎస్టేట్ షేర్లు పతనం
ప్రధాని మోదీ వర్క్ ఫ్రం హోమ్ పిలుపుతో బెంగళూరు రియల్ ఎస్టేట్ షేర్లు పతనం

PM Modi: ప్రధాని మోదీ వర్క్ ఫ్రం హోమ్ పిలుపుతో బెంగళూరు రియల్ ఎస్టేట్ షేర్లు పతనం

వ్రాసిన వారు Sirish Praharaju
May 11, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వర్క్ ఫ్రం హోమ్ సూచన ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధనం, విదేశీ మారక నిల్వలను ఆదా చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో మళ్లీ కరోనా కాలంలో అమలు చేసిన వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ సమావేశాలు,వర్చువల్ విధానాలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలతో ఐటీ ఉద్యోగులు మళ్లీ ఇంటి నుంచే పనిచేసే పరిస్థితులు రావచ్చనే చర్చ మార్కెట్‌లో మొదలైంది.

వివరాలు 

రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లపై అమ్మకాల ఒత్తిడి

దీంతో బెంగళూరులో కార్యాలయ స్థలాల డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనలతో రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. సోమవారం ట్రేడింగ్‌లో బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 1.17 శాతం పడిపోయి రూ.749.35 వద్ద ముగిసింది. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ షేర్ 2.96 శాతం క్షీణించి రూ.1,462.70కు చేరింది. పురవంకర లిమిటెడ్ షేర్ కూడా 2.20 శాతం తగ్గి రూ.213.92 వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు నిఫ్టీ రియాల్టీ సూచీ కూడా 2.32 శాతం పడిపోయి 804.50 స్థాయికి చేరుకుంది. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్‌లను విజయవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు.

వివరాలు 

విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందన్న మోదీ 

ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మళ్లీ అలాంటి విధానాలను అమలు చేయడం దేశ ప్రయోజనాలకు అనుకూలమని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్,కార్ పూలింగ్,ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కూడా ప్రధాని సూచించారు.

Advertisement

వివరాలు 

కార్మిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన NITES

ఇదే సమయంలో ఐటీ ఉద్యోగుల సంఘం ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (FITE) కేంద్ర ప్రభుత్వం వెంటనే అధికారికంగా వర్క్ ఫ్రం హోమ్ మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగులు స్వయంగా నిర్ణయం తీసుకోలేరని, కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు అవసరమని పేర్కొంది. అలాగే ఐటీ రంగ సంస్థ నైట్స్ (NITES) కూడా కార్మిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో తప్పనిసరిగా వర్క్ ఫ్రం హోమ్ అమలు చేసేలా సూచనలు ఇవ్వాలని కోరింది.

Advertisement