Bharat Atta: దీపావళి వేళ గుడ్‌న్యూస్.. 'భారత్ అట్టా' పిండిని రూ. కిలో 27.50కు విక్రయిస్తున్న కేంద్రం
దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి భారత్ బ్రాండ్ పేరుతో 'ఆట్టా' గోధుమ పిండిని తక్కువ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది. తగ్గించిన ధరలో కిలో పిండి ధర రూ.27.50 అవుతుంది. ఇంతకు ముందు కిలో పిండి ధర రూ.29.50 ఉండేది. నేటి మధ్యాహ్నం నుంచి తక్కుక ధరకు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(NCCF) వంటి సహకార సంస్థల ద్వారా కేంద్రం సబ్సిడీ ధరలకు 'భారత్ అట్టా' పిండిని విక్రయించనుంది.
కేంద్రంపై రూ.2లక్షల కోట్ల భారం
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించమే లక్ష్యంగా కేంద్రం ఇప్పటికే తక్కువ ధరలకు ఉల్లి, పప్పులు అందిస్తోంది. ఒక కిలో ఉల్లిగడ్డను రూ.25, భారత్ దాల్‌ను రూ.60కు కేంద్రం సబ్సిడీకి విక్రయిస్తోంది. అలాగే చక్కెర, ఇతర అవసరమైన ఆహార పదార్థాల రేట్లను తగ్గించడానికి కేంద్ర సిద్ధమవుతోంది. ఇదలా ఉంటే, ఉచిత రేషన్ పంపిణీని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగించే ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వెల్లడించారు. దీని వల్ల 80 కోట్ల మంది వినియోగదారులను లబ్ధి చేకూరనుంది. ఉచిత రేషన్ కార్యక్రమం వల్ల ప్రభుత్వంపై రూ. ఏటా 2 లక్షల కోట్లు భారం పడుతుంది. గోధుమలు, బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం ఇప్పటికే ఈ తృణధాన్యాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది.