వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC)కి దాఖలు చేసిన ప్రకటన ప్రకారం, BharatPe వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కు రూ.1.69 కోట్లు,అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్‌లకు రూ.63 లక్షలు చెల్లించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సంస్థ గత ఏడాది వీరిద్దరిని BharatPe తొలగించింది. అతని వ్యవస్థాపకుడి పదవిని కూడా తొలగించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు రూ.88 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని అతనిపై దావా వేసింది. దాదాపు ఏడాది కాలంగా BharatPe అష్నీర్ గ్రోవర్‌తో న్యాయ పోరాటం చేస్తోంది. ఇప్పుడు, కంపెనీ తన ఆర్థిక నివేదికను విడుదల చేయడంతో, ఈ పోరాటం కీలక మలుపు తిరిగింది. సంస్థ గ్రోవర్ చేసిన ఆర్థిక దుర్వినియోగం కారణంగా ఏర్పడిన నష్టాలను హైలైట్ చేసింది.
టాప్ మేనేజ్మెంట్ జీతాలను ప్రకటించిన BharatPe సంస్థ
ఈ సంస్థ చైర్ పర్సన్ అయిన రజనీష్ కుమార్ జీతం రూ. 21.4 లక్షలు. వ్యవస్థాపకుడు, బోర్డు సభ్యుడు శాశ్వత్ నక్రానీకు రూ. 29.8 లక్షలు, మరో బోర్డు సభ్యుడు కేవల్ హండాకు రూ. 36 లక్షలు. మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుహైల్ సమీర్ కు జీతం రూ. 2.1 కోట్లు. BharatPe వాటా ఆధారిత చెల్లింపు ఖర్చులు 2022 ఆర్ధిక సంవత్సరంలో రూ. 70 కోట్లు, ఇది 2021తో పోలిస్తే 218% పెరిగింది. సంస్థ జీతం ఖర్చులు రూ. 110 కోట్లు అయితే ప్రకటనల ఖర్చులు 535% సంవత్సరానికి పెరిగి రూ. 246 కోట్లు అయింది. మిగతా కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 284% పెరిగి రూ. 457 కోట్లు.