LOADING...
NBFC: ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో పెద్ద మార్పులు.. అప్పర్‌ లేయర్‌లోకి ప్రభుత్వ సంస్థలు చేరే అవకాశాలు
ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో పెద్ద మార్పులు.. అప్పర్‌ లేయర్‌లోకి ప్రభుత్వ సంస్థలు చేరే అవకాశాలు

NBFC: ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో పెద్ద మార్పులు.. అప్పర్‌ లేయర్‌లోకి ప్రభుత్వ సంస్థలు చేరే అవకాశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) అగ్రశ్రేణి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFC-Upper Layer) గుర్తింపునకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న పారామెట్రిక్‌ వ్యవస్థకు బదులుగా, ఆస్తుల పరిమాణాన్ని ప్రధాన ప్రమాణంగా తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. తాజా ముసాయిదా ప్రకారం.. రూ.1 లక్ష కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన సంస్థలను NBFC-అప్పర్‌ లేయర్‌గా వర్గీకరించనున్నారు. ఈ ముసాయిదా విడుదల కావడం టాటా సన్స్‌ లిస్టింగ్‌ అంశం చర్చనీయాంశంగా మారిన సమయంలో జరగడం విశేషం. ఆర్‌ బి ఐ నిబంధనల ప్రకారం, అగ్రశ్రేణి 15 NBFC-UL సంస్థలు తప్పనిసరిగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌ కావాలి.

వివరాలు

తన

అయితే 2025 అక్టోబర్‌ గడువు ముగిసినా, ఈ జాబితాలో ఉన్న టాటా సన్స్‌ మాత్రమే ఇప్పటివరకు లిస్టింగ్‌ పూర్తి చేయని సంస్థగా మిగిలింది. ఇంకా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే NBFCలను కూడా NBFC-అప్పర్‌ లేయర్‌ జాబితాలో చేర్చాలని అర్‌బిఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం ప్రభుత్వ NBFCలు ప్రాథమిక లేదా మధ్య తరహా సంస్థలుగా మాత్రమే పరిగణించబడుతున్నాయి. ఈ మార్పులతో వాటి వర్గీకరణలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యవస్థలో అదనపు ద్రవ్యలభ్యతను నియంత్రించేందుకు RBI మరో చర్యగా రూ.2 లక్షల కోట్ల విలువైన వేరియబుల్‌ రేట్‌ రివర్స్‌ రెపో (VRRR) వేలాన్ని నిర్వహించనుంది. ఈ వేలం ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల మధ్య జరుగనుంది.

Advertisement