LOADING...
Income Tax Rules 2026: హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. HRA మినహాయింపు పెంపు
హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. HRA మినహాయింపు పెంపు

Income Tax Rules 2026: హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. HRA మినహాయింపు పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2026
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇంటి అద్దె భత్యం (HRA)పై పన్ను మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను శుక్రవారం అధికారికంగా నోటిఫై చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆరు దశాబ్దాల పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో కొత్త పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ కొత్త చట్టంలో భాగంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న మార్పులను గెజిట్ ద్వారా ప్రకటించింది.

వివరాలు 

మెట్రో నగరాల జాబితాలో కొత్త నగరాలు

ముందుగా ముంబయి, కోల్‌కతా, దిల్లీ, చెన్నై నగరాలనే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఈ నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే HRAపై 50% వరకు పన్ను మినహాయింపు లభించేది. ఇప్పుడు ఈ జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలను కూడా చేర్చింది కేంద్రం. దీంతో మొత్తం 8 మెట్రో నగరాల్లో నివసించే ఉద్యోగులు తమ జీతంలో 50 శాతం వరకు HRAపై పన్ను మినహాయింపు పొందే అవకాశం కలిగింది. అయితే మెట్రో నగరాలకు చెందని ప్రాంతాల్లో పనిచేసే వారికి HRA మినహాయింపు యథాతథంగా 40 శాతంగానే కొనసాగుతుంది.

వివరాలు 

ఎప్పుడు అమల్లోకి.. ఎవరికీ వర్తింపు?

ఈ మార్పులు కొత్త ఆర్థిక సంవత్సరంతో అమల్లోకి వస్తాయి. అంటే 2027 జూలైలో ఫైల్ చేసే ఆదాయపు పన్ను రిటర్నులపై ఈ నిబంధనలు వర్తిస్తాయి. ముఖ్యంగా, పాత పన్ను విధానం (Old Tax Regime)ను ఎంచుకున్న ఉద్యోగులకు మాత్రమే ఈ HRA మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కొత్త పన్ను విధానం (New Tax Regime)ను ఎంచుకున్నవారికి ఈ సడలింపు వర్తించదు.

Advertisement